సీమాంద్ర మున్సిపాలిటీలు బంద్
posted on Aug 5, 2013 @ 10:04AM
రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంద్ర ప్రాంతంలో ఉద్యమాలు ఉదృతం అవుతున్నాయి. ఇన్నాళ్లు రాజకీయనాయకులు, విద్యార్ధలు మాత్రమే పాల్గొన్న ఉద్యమంలో నేటి నుంచి ప్రభుత్వొద్యోగులు కూడా భాగం కానున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సీమాంద్రలోని 13 జిల్లా మున్సిపాలిటీ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు.
ఈ మేరకు మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగులు, కమిషనర్ల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం చైర్మన్ కృష్ణమోహన్‌రావు, కమిషనర్ల సంఘం అధ్యక్షుడు శివరామకృష్ణ పాల్గొన్న సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులు మూడు రోజులపాటు విధులు బహిష్కరించనున్నట్టు తెలిపారు.
దీంతో పాటు జెఏసి తలపెట్టిన అన్నిరకాల నిరసనలకు సమ్మెలకు మున్సిపాలిటీ ఉద్యోగులు సహాకరిస్తారని ప్రకటించారు.