ముగిసిన మరో ప్రజా ప్రస్థానం
posted on Aug 4, 2013 @ 8:04PM
వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, జగన్‌మోహన్ రెడ్డి చెల్లెలు, షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాద యాత్ర ముగిసింది. 2012 అక్టోబర్ 18న కడపజిల్లా ఇడుపుల పాయలో ప్రారంభమైన షర్మిల పాద యాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగించారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల ప్రారంభించిన పాదయాత్ర 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్లకుపైగా సాగింది.
ఈ యాత్ర 14జిల్లాల్లో 230 రోజుల పాటు 2250 గ్రామాల మీదుగా 3112 కిలోమీటర్ల వరకు సాగింది.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో షర్మిల ఎంతో మంది ప్రజలను కలిశారు. వెళ్లిన ప్రతిచోట అధికార ప్రతిపక్షాలపై విమర్షనాస్త్రాలను సందిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ చూపించారు. దాదాపుకు కోటి మందికి పైగా ప్రజలను కలిసిన షర్మిల ఆగస్టు 4 ఆదివారం ఇచ్చాపురంలో యాత్ర ముగించారు. పాదయాత్ర ముగిస్తున్న సందర్భంగా ఇచ్ఛాపురంలో విజయ స్థూపాన్ని షర్మిల ప్రారంభించనున్నారు.