ఆగస్టు 12లోపు రాజీనామా చేయకుంటే అంతే..
posted on Aug 5, 2013 @ 10:06AM
ఐదు రోజులు గడిచిన సీమాంద్రలో నిరసనల హోరు మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే ప్రజాల సంఘాలు విద్యార్ధులు ఉద్యమంలో పాల్గొంటుండగా రాజకీయానాకులకు కూడా ఉద్యమకారులు హుకుం జారీ చేశారు. ఆగస్టు 12 లోగా పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలంటూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ డెడ్‌లైన్ విధించింది.
పదవుల కోసం పాకులాడుతూ ఉద్యమంలోకి రాని పక్షంలో త్వరలోరాభోయే ఎలక్షన్స్‌లో ప్రజలే ఆ నాయకులకు తగిన బుద్ది చెపుతారన్నారు. నాయకలు ఉద్యమంలో చేరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విభజన ఆపే దిశగా వత్తిడి చేయాలని అలా జరగని పక్షంలో 12 అర్ధరాత్రి నుంచి నిరవదిక సమ్మెకు దిగుతున్నట్టుగా ప్రకటించారు.
ఏపి ఎన్జీవోలతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, విద్యార్ధులు, రాజకీయనాయకులు ఇలా అందకిని ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి రాష్ట్ర సమైక్య పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. హైరదాబాద్ ఆంద్రప్రదేశ్‌లో భాగం అన్న ఎన్జీవోలు ఆగస్టు 15న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.