జగన్ చాలా కాలం జైళ్లో ఉండాల్సి వస్తుంది
posted on Aug 5, 2013 @ 10:20AM
వైయస్‌ఆర్ అభిమానిగా ఉండి ఇటీవల వైకాపా పార్టీని వీడిన కొండా సురేఖ మరోసారి వైఎస్‌ఆర్‌సిపి పై దుమ్మెత్తి పోశారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం ఆపార్టీలో ఉన్నతెలంగాణ నేతలంతా పార్టీని వీడాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే తనతో పాటు పార్టీని వీడిన జిట్టా బాలకృష్ణారెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, రాజ్‌ఠాకూర్‌తో కలిసి భువనగిరిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా ఉండేవారని కాని ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం వైయస్ ఆశయాలకు వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా ఇడుకుల పాయ వైయస్ సమాది సాక్షిగా మాట ఇచ్చిన వైసిపి ఇప్పుడు మాట తప్పిందన్నారు.
జగన్ తన తీరు మార్చుకోకపోతే మరింత కాలం జైళులోనే గడపాల్సి వస్తుందన్నారు సురేఖ, వైయస్ అంటే తమకు ఇప్పటికీ అభిమానం ఉందన్న నేతలు అభిమానం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అన్నారు.