మేం రాజీనామా చేయం: బొత్సా
posted on Aug 5, 2013 @ 10:16AM
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ముఖ్యమంత్రి పిసిసి చీఫ్‌లు రాజీనామ చేయాలంటూ వస్తున్న ఒత్తిని పిసిసి చీఫ్ బోత్సా సత్యనారాయణ తొసి పుచ్చారు. సమైఖ్యంగా డిమాండ్‌తో తాను రాజీనామ చేయబోవటం లేదని ఆయన తేల్చి చెప్పారు. తాము రాజీనామ చేస్తే శాసన సభలో సమైక్య వాణి ఎవరు వినిపిస్తారంటూ ఆయన ప్రశ్నించారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం సీమాంద్ర నేతల సమావేశంలో తాము కూడా సంతకాలు చేశామని చెప్పారు. విభజిస్తే వచ్చే నీటి వనరులు, విద్యా, ఉద్యోగ ఉపాది అవకాశాలు లాంటి సమస్యల విషయం పై కూడా అధిష్టానంతో చర్చిస్తామన్నారు.
పార్లమెంట్‌లో తెలంగాణబిల్లు పాసవుతువందో లేదో ఇప్పుడే చెప్పలేమన్న బొత్స, టిడిపి, వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లు రాజకీయ లబ్దికోసమే దేశనాయకుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.