లగడపాటికి వ్యాపారం, చిరుకు పదవే ముఖ్యం: కేశవ్
posted on Aug 5, 2013 @ 12:00PM
రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారం జరగలేదని, కాంగ్రెసు పార్టీ రాజకీయ కోణంలోనే విభజన చేసిందని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. చిరంజీవి కి కేంద్ర మంత్రి పదవి, లగడపాటి కి తన వ్యాపారాలే ముఖ్యమని ఆయన అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలను తాయిలాలు, బెదిరింపుల ద్వారా అధిష్టానం దారిలోకి తెచ్చుకుందని విమర్శించారు.
లగడపాటికి దమ్ముంటే ఢిల్లీలో ఆందోళన చేయాలని హితవు పలికారు.రాజీనామాలు వద్దంటూనే కాంగ్రెసు నేతలు ఎందుకు రాజీనామా చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కష్టాలను పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్లాలని సవాల్ చేశారు.
ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లుగా తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం జరగలేదన్నారు.