వేటు మంచి కోసమే
posted on Aug 5, 2013 @ 6:15PM
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే అది టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఒక్కరిది కాదని, అమరవీరులతో పాటు తామందరిదని మెదక్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. తనపై వేటు వేసిన కేసీఆర్ ఇంతవరకు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదో అర్ధం కాలేదని, నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని ఆమె తెలిపారు.
నాపై వేటు నా మంచి కోసమేనని రాములమ్మ అన్నారు. ఎందుకు వేటు వేశారో ప్రస్తుతం చెప్పలేనని, నాతో పాటు ఇంకెందరిపై వేటు పడిందో ఇప్పుడే చెప్పలేనని, నోటీసు వచ్చిన తర్వాత స్పందిస్తానని అన్నారు. వేటుపై కేసీఆర్‌పై విమర్శలు చేసి సంస్కారాన్ని కోల్పోనని విజయశాంతి పేర్కొన్నారు.
16 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. నేనేంటో రాష్ట్రంలోనేకాక, దేశంలో అందరికీ తెలుసునని, షోకాజ్ నోటీసు వచ్చిన తర్వాతే తన అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యాచారణపై నిర్ణయం తీసుకుంటామని విజయశాంతి స్పష్టం చేశారు.