మదర్స్ డే స్పెషల్ స్టోరీ.. మన వెండితెర 'అమ్మ'!
సంతోషం వచ్చినా, దిగులేసినా, దుఃఖం ముంచుకొచ్చినా, దెబ్బతగిలినా అప్రయత్నంగా గుర్తొచ్చే పదం అమ్మ. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం అమ్మ. అమ్మ గురించి ఎవరెన్ని చెప్పినా అది తక్కువే. భాషకు అందని భావం అమ్మ. ఆ భావాన్ని మన సినిమాల్లో తమకు తోచిన రీతిలో ఆవిష్కరించారు మన దర్శకులు, నిర్మాతలు.