English | Telugu
ఈవారం (మే 17-23) ఓటీటీలో విడుదలవుతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్-షోస్!
Updated : May 17, 2021
మహమ్మారి కారణంగా థియేటర్లు దేశంలోని థియేటర్లన్నీ మూతపడటంతో జనమంతా ఇప్పుడు ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిలోని భయాందోళనలను పోగొట్టి వినోదాన్ని అందించడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మించింది ఇప్పుడు వేరొకటి కనిపించడం లేదు. ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు, వాటిలో ఎన్నో భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వాటికి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవలే సల్మాన్ ఖాన్ ఫిల్మ్ 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్' డైరెక్ట్‌గా జీ5 ప్లాట్‌ఫామ్‌పై రిలీజై, ఫస్ట్ డే 4.2 మిలియన్ వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది.
అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలైన 'సినిమా బండి' అనే చిన్న తెలుగు సినిమా అందర్నీ అలరిస్తూ నేషనల్ లెవల్లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వారం కూడా వివిధ భాషలకు చెందిన ఆసక్తికర సినిమాలు, సిరీస్ ఓటీటీలో విడుదలవుతన్నాయి. వాటిలో ఇటీవలే కొవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్ట్-నటుడు టీఎన్ఆర్ నటించిన 'ప్లేబ్యాక్' మూవీ, తరుణ్ భాస్కర్ ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తోన్న 'రూమ్ నం. 54' సిరీస్, రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఫిల్మ్ 'సర్దార్ కా గ్రాండ్‌సన్' లాంటివి ఉన్నాయి. మే 17 నుంచి మే 23 మధ్య ఓటీటీలో వస్తున్న ఆసక్తికర కొత్త కంటెంట్ ఏమిటో చూద్దామా...
సర్దార్ కా గ్రాండ్‌సన్ (హిందీ)
తారాగణం: అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, నీనా గుప్తా, జాన్ అబ్రహాం
డైరెక్టర్: కాష్వీ నాయర్
విడుదల తేదీ: మే 18
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
రన్అవే లుగాయ్ (హిందీ సిరీస్)
తారాగణం: నవీన్ కస్తూరియా, రుహీ సింగ్, సంజయ్ మిశ్రా, రవి కిషన్, ఆర్య బబ్బర్
డైరెక్టర్: అవినాష్ దాస్
విడుదల తేదీ: మే 18
ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఎంఎక్స్ ప్లేయర్
అనదర్ రౌండ్ (ఆస్కార్ విన్నింగ్ డేనిష్ మూవీ)
తారాగణం: మాడ్స్ మికెల్‌సన్, మరియా బొన్నేవీ, మాగ్నస్ మిలాంగ్, థామస్ బో లార్సన్
డైరెక్టర్: థామస్ వింటర్‌బెర్గ్
విడుదల తేదీ: మే 20
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
నవంబర్ స్టోరీ (తమిళ్ సిరీస్)
తారాగణం: తమన్నా భాటియా, జి.ఎం. కుమార్
డైరెక్టర్: రామ్ సుబ్రమణియన్
విడుదల తేదీ: మే 20
ఓటీటీ ప్లాట్‌ఫామ్: డిస్నీప్లస్ హాట్‌స్టార్
అవేకన్ సీజన్ 1 (కొరియన్ సిరీస్)
తారాగణం: నమ్‌గూంగ్ మిన్, సియోల్‌హ్యున్, లీ చుంగ్
డైరెక్టర్: కిమ్ జుంగ్-హ్యున్
విడుదల తేదీ: మే 20
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
ఆర్మీ ఆఫ్ ద డెడ్ (అమెరికన్ హారర్ ఫిల్మ్)
తారాగణం: డేవ్ బటిస్టా, హిరోయుకి సనద, హుమా ఖురేషి
డైరెక్టర్: జాక్ స్నైడర్
విడుదల తేదీ: మే 21
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
సోలోస్ (అమెరికన్ సిరీస్)
తారాగణం: అన్నే హథావే, మోర్గాన్ ఫ్రీమన్, హెలెన్ మిర్రెన్, ఉజో అడుబా
డైరెక్టర్: డేవిడ్ వీల్
విడుదల తేదీ: మే 21
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ప్లే బ్యాక్ (తెలుగు మూవీ)
తారాగణం: దినేశ్ తేజ్, అనన్య నాగళ్ల
డైరెక్టర్: జక్కా హరిప్రసాద్
విడుదల తేదీ: మే 21
ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా
కమలి ఫ్రమ్ నడుక్కావేరి (తమిళ ఫిల్మ్)
తారాగణం: ఆనంది, రోహిత్ సురేశ్ సరాఫ్
డైరెక్టర్: రాజశేఖర్ దురైస్వామి
విడుదల తేదీ: మే 21
ఓటీటీ ప్లాట్‌ఫామ్: జీ5
రూమ్ నంబర్ 54 (తెలుగు సిరీస్)
తారాగణం: కృష్ణతేజ, మొయిన్, పవన్, కె. ప్రసాద్
డైరెక్టర్: డి.ఎస్. గౌతమ్
ప్రెజెంటర్: తరుణ్ భాస్కర్
విడుదల తేదీ: మే 21
ఓటీటీ ప్లాట్‌ఫామ్: జీ5
మాస్టర్ ఆఫ్ నన్ సీజన్ 3 (అమెరికన్ కామెడీ సిరీస్)
తారాగణం: అజీజ్ అన్సారి, నోయల్ వెల్స్, ఎరిక్ వేర్‌హీమ్
డైరెక్టర్: అజీజ్ అన్సారి, అలన్ యంగ్
విడుదల తేదీ: మే 23
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్