English | Telugu
మోస్ట్ వ్యూస్ సాధించిన టాప్ 10 వీడియో సాంగ్స్ ఇవే...
Updated : May 5, 2021
ఒత్తిడి నుంచి మనిషిని బయటపడేసే బెస్ట్ మెడిసిన్ ఏదంటే.. ఎవరైనా చెప్పే ఆన్సర్.. మ్యూజిక్! యస్. మంచి పాట మనలో శక్తిని నింపి, ఉత్తేజాన్నిస్తుందనడంలో సందేహం లేదు. చాలామందికి మెలోడీస్ నచ్చుతాయి. యంగ్ జనరేషన్‌కు అయితే ఫాస్ట్ బీట్స్ ఇష్టం. కొన్ని పాటల్లో సాహిత్యం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంటుంది. సాహిత్యం, సంగీతం పోటీపడుతూ సాగే పాటలెన్నో. అలాంటి పాటలకు శాశ్వతత్వం ఉంటుంది. యూట్యూబ్‌లోనూ అలాంటి పాటలనే ఎక్కువగా వ్యూయర్స్ లైక్ చేస్తున్నారు. తెలుగులో అలా అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 10 సాంగ్స్ వైపు ఓ లుక్కేద్దామా...
1. బుట్టబొమ్మ (అల.. వైకుంఠపురములో)
వ్యూస్: 602 మిలియన్ వ్యూస్
తమన్ సంగీతం సమకూర్చగా రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించాడు. మూవీలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీపై చిత్రీకరించారు. వరల్డ్ వైడ్‌గా ఈ సాంగ్ పాపులర్ అయ్యింది.
2. రాములో రాములా (అల.. వైకుంఠపురములో)
వ్యూస్: 349 మిలియన్
తమన్ స్వరాలు కూర్చగా కాకర్ల శ్యామ్ రాసిన ఈ ఫోక్ సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు. సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, సునీల్, నవదీప్ తదితర ప్రధాన తారాగణంపై చిత్రీకరించారు.
3. వచ్చిండే పిల్లా (ఫిదా)
వ్యూస్: 299 మిలియన్
శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించగా సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ ఫోక్ సాంగ్‌ను మధుప్రియ, రాంకీ ఆలపించారు. మూవీలో సాయిపల్లవి, వరుణ్‌తేజ్ బృందంపై తీశారు.
4. రంగమ్మా మంగమ్మా (రంగస్థలం)
వ్యూస్: 278 మిలియన్
దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ ఫోక్ సాంగ్‌ను చంద్రబోస్ సూపర్బ్‌గా రాశారు. ఎం.ఎం. మానసి ఆలపించిన ఈ పాటను రామ్‌చరణ్, సమంత జంటపై చిత్రీకరించారు.
5. నీలి నీలి ఆకాశం (30 రోజుల్లో ప్రేమించడం ఎలా)
వ్యూస్: 250 మిలియన్
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మెలోడీకి చంద్రబోస్ రాసిన సాహిత్యం ప్రాణం. చిత్రంలో ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ జంటపై తీసిన ఈ పాటను సిద్ శ్రీరామ్, సునీత రాగయుక్తంగా ఆలపించారు.
6. పిల్లా రా (ఆర్ఎక్స్ 100)
వ్యూస్: 197 మిలియన్
చైతన్ భరద్వాజ్ బాణీలు సమకూర్చిన ఈ లవ్ సాంగ్‌కు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. మూవీలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌పై చిత్రీకరించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి సూపర్బ్‌గా పాడాడు.
7. ఇంకేం ఇంకేం కావాలే (గీత గోవిందం)
వ్యూస్: 188 మిలియన్
గోపి సుందర్ స్వరాలు కూర్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీని అనంత శ్రీరామ్ రాశారు. సిద్ శ్రీరామ్ సూపర్బ్‌గా ఆలపించిన ఈ పాటను విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నపై చిత్రీకరించారు.
8. దిమాక్ ఖరాబ్ (ఇస్మార్ట్ శంకర్)
వ్యూస్: 183 మిలియన్
మణిశర్మ సంగీత స్వరాలు అందించిన ఈ బీట్ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రచించాడు. సినిమాలో రామ్, నభా నటేశ్, నిధి అగర్వాల్‌పై తీసిన ఈ పాటను సాకేత్, కీర్తన శర్మ పాడారు.
9. సామజవరగమన (అల.. వైకుంఠపురములో)
వ్యూస్: 179 మిలియన్
తమన్ బాణీలు సమకూర్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీకి సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీపై పారిస్‌లో పిక్చరైజ్ చేసిన ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించాడు.
10. జిగేలు రాణి (రంగస్థలం)
వ్యూస్: 150 మిలియన్
దేవి శ్రీప్రసాద్ స్వరాలు అందించిన ఈ ఐటమ్ నంబర్‌కు చంద్రబోస్ రాసిన సాహిత్యం సో ఇంట్రెస్టింగ్. రీలా కుమార్, గంటా వెంకటలక్ష్మి పాడిన ఈ స్పెషల్ సాంగ్‌ను పూజా హెగ్డే, రామ్‌చరణ్ బృందంపై చిత్రీకరించారు.