English | Telugu
రష్మిక నెల సంపాదన ఎంతో తెలిస్తే స్టన్నవుతారు!
Updated : May 21, 2021
సౌత్ ఇండియాలోని మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈ బెంగళూరు అమ్మాయి తన కెరీర్‌లో కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ'తో స్టార్ట్ చేసి, ఇన్‌స్టంట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది. ఆ సినిమా నుంచే ఆమె స్టార్‌గా మారిపోయింది. తెలుగులో విజయ్ దేవరకొండ జోడీగా నటించిన 'గీత గోవిందం' ఆమె కెరీర్‌కు మరింత బూస్ట్ నిచ్చింది. దాని తర్వాత ఆమె తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.
మహేశ్‌తో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది రష్మిక. తమిళంలో కార్తీ జోడీగా చేసిన 'సుల్తాన్'తో కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడకపోయినా ఆమెకు కలిగిన నష్టమేమీ లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో అల్లు అర్జున్ 'పుష్ప', శర్వానంద్ 'ఆడవాళ్లూ మీకు జోహార్లు', బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా సినిమా 'మిషన్ మంగళ్', అమితాబ్ బచ్చన్ మూవీ 'గుడ్‌బై' ఉన్నాయి.
సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, టీవీ కమర్షియల్స్ ద్వారా ఇప్పటిదాకా ఆమె రూ. 35 కోట్ల దాకా సంపాదించిందని ఒక అంచనా. ప్రస్తుతం ఆమె నెలసరి సంపాదన యావరేజ్‌న 35 లక్షల నుంచి 40 లక్షల దాకా ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి. అలాగే ఒక సినిమాకు కాల్షీట్లను బట్టి 4 కోట్ల నుంచి 5 కోట్ల దాకా అందుకుంటోందని అంటున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో తన మూడో సినిమాకు ఆమె సంతకం చేసిందని సమాచారం.