పద్దెనిమిదేళ్ల తర్వాత టీవీ షో కోసం ఇంద్రజ ఏం చేశారంటే?
'యమలీల' సినిమాలో 'నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో...' పాటలో ఇంద్రజ మాస్ డాన్స్ చేస్తే, టాలీవుడ్ ఆడియన్స్ కూడా స్టెప్పులు వేశారు. 'అమ్మ దొంగా'లో ఆమె వేసిన స్టెప్పులు కూడా హిట్టే. అప్పట్లో డాన్స్ బాగా చేసే హీరోయిన్లలో ఇంద్రజ పేరు వినిపించేది. పెళ్లి, పిల్లలు తర్వాత ఇంద్రజ సినిమాలకు దూరం అయ్యారు. రీఎంట్రీలో తల్లి పాత్రలు, పెద్దమనిషి తర్వాత పాత్రల్లో నటించే అవకాశాలు వస్తుండటంతో పాటల్లో డాన్స్ చేసే అవకాశం ఇంద్రజకు దక్కలేదు.