English | Telugu

సుధీర్-రష్మీ మ‌ళ్లీ పెళ్లి!

'సుడిగాలి' సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని కామెంట్లు వినిపిస్తుంటాయి. ఏదో ఎఫైర్ వుందని అంటారంతా. కాని తమ మధ్య ఏమీ లేదని ఇద్దరూ ఎప్పుడూ ఖండించలేదు. మీమధ్య ప్రేమ వుందంట కదా అని అడిగితే ముసిముసి నవ్వులు నవ్వుతూ 'మంచి స్నేహితులం మాత్రమే' అంటూ ఆన్సర్ ఇస్తారు ఇద్దరూ.

ఆడియన్స్‌లో సుధీర్, రష్మీ జోడీకి వున్న క్రేజ్ క్యాష్ చేసుకోవడం కోసం ఈటీవీ కోసం మల్లెమాల వాళ్ళు 'అహ‌ నా పెళ్ళంట' అని ఒక పండక్కి ప్రోగ్రామ్ చేశారు. వాళ్ల పెళ్లి చేశారు. రియల్ లైఫ్‌లో సుధీర్, రష్మీ గౌతమ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారోనని వెయిట్ చేస్తున్న జనాలు వున్నారు. రీసెంట్‌గా 'రెచ్చిపోదాం బ్రదర్' షోలో సుధీర్‌ను, 'ఎక్సట్రా జబర్దస్త్'లో రష్మీను 'బుల్లెట్' భాస్కర్ ఫాదర్ 'మీ పెళ్లి ఎప్పుడు?' అని అడిగాడు. ఇద్దరూ సమాధానం దాటవేశారు. రియల్ లైఫ్‌లో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, అసలు చేసుకోరో తెలియదు గానీ... రీల్ లైఫ్‌లో ఇంకోసారి సుధీర్, రష్మీ పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు సుధీర్, రష్మీ పెళ్లికి 'హైపర్' ఆది పెద్ద. ఎందుకంటే... ఈసారి వాళ్ళిద్దరి పెళ్లి చేసింది అతడే. ప్రతి వారం తన స్కిట్‌లో సమ్‌థింగ్ వుండేలా చూసుకోవడం ఆది స్పెషాలిటీ. ఎవరో ఒకరిని అతిథులుగా తీసుకొస్తాడు. జూలై 15న టెలికాస్ట్ కానున్న జ‌బ‌ర్ద‌స్త్‌ ఎపిసోడ్ కోసం సుధీర్, రష్మీ, దీపికా పిల్లిని తీసుకొచ్చాడు. స్కిట్‌ను కూడా మ్యారేజ్ థీమ్‌లో డిజైన్ చేశాడు. అందులో సుధీర్ - రష్మీ, ఆది - దీపికా పెళ్లి చేసుకోబోతున్న జంటలుగా కనిపించారు.

'ఆ సూర్య రశ్మిలు వున్నంత కాలం ఈ సుధీర్, రష్మీలు అలాగే వుంటారు' అని సుధీర్ డైలాగ్ చెప్పడం గమనార్హం. దానికి 'రాత్రి ఎక్కడ వుంటాడు?' అని ఆది కౌంటర్ వేయడం, ఎప్పటిలా ప్లేబాయ్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూ... 'పదిన్నర అయ్యింది. ఏంటిమరి?' అని రష్మీని సుధీర్ అడగటం ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.