English | Telugu

హరి గుండెలపై 'అషు'! చాచి కొట్టింది బాసూ!

డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అషురెడ్డి.. బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ దక్కిచుకుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ టాటూని తన ఎదపై వేయించుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేసింది . ఈ మధ్యకాలంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఎఫైర్ పెట్టుకుందంటూ ఆమెపై ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. వాటిని ప్రమోషన్స్ కోసం వాడేసింది అషురెడ్డి. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు, వీడియోలతో రచ్చ చేసే ఈ బ్యూటీ స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షోలో పాల్గొంటుంది.

ఈ షోలో కమెడియన్ హరితో కలిసి సందడి చేస్తుంటుంది అషురెడ్డి. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో హరి.. అషురెడ్డికి పెద్ద షాకే ఇచ్చాడు. ఈ మధ్య వీరిద్దరూ కలిసి స్కిట్ లు చేస్తుండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటికి మ‌రింత‌ బలాన్ని చేకూరుస్తూ హరి తన గుండెలపై అషురెడ్డి పేరుని టాటూగా వేయించుకున్నాడు.

ముందుగా అషురెడ్డి వెంటపడే వ్యక్తిగా స్కిట్ చేసిన హరి.. ''నువ్ ఛీ కొట్టినా, చెంపమీద కొట్టినా.. నీ వెనకాలే తిరిగి నువ్వే కావాలనుకుంటున్నాను చూశావా? అందులోనే నిజమైన ప్రేమ ఉంది.. అమ్మాయి ప్రేమ కళ్లల్లో కనిపిస్తుంది.. కానీ అబ్బాయి ప్రేమ కన్నీళ్లలో మాత్రమే కనిపిస్తుంది'' అంటూ భారీ డైలాగ్‌లు పలికిస్తూ.. ''నిన్ను ఎంతలా గుర్తుపెట్టుకున్నానో తెలుసా.. నువ్ ఎప్పటికీ నా గుండెలపై ఉండిపోయేంతలా.." అంటూ తన గుండెలపై ఉన్న అషురెడ్డి పచ్చబొట్టును చూపించాడు. అది చూసి బిత్త‌ర‌పోయింది అషు. స్కిట్ కోసం కాదని.. నిజంగానే టాటూ వేయించుకున్నానని హరి ఎమోషనల్ అవుతూ చెప్పడంతో అషురెడ్డి అతడి చెంపపై కొట్టింది.

హ‌రి టాటూ వేయించుకోవ‌డం చూసి అక్క‌డున్న జ‌డ్జిలు స‌హా అంద‌రూ షాకైపోయారు. హ‌రి దీన్ని స్కిట్ లో భాగంగా చేశాడా..? లేక నిజంగానే అషుపై ప్రేమ‌తో అలా ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నాడా..? అనే ఈ విష‌యం ఈరోజు మ‌ధ్యాహ్నం మ‌న‌కు తెలుస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.