English | Telugu

షణ్ముఖ్‌తో దీప్తి బ్రేకప్..?

డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన దీప్తి సునైనా.. బిగ్ బాస్ షోలో పాల్గొని తన ఫాలోయింగ్ పెంచుకుంది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు, స్పెషల్ ఆల్బమ్స్ అంటూ బిజీగా గడుపుతోంది. అయితే చాలాకాలంగా దీప్తి సునైనా.. యుట్యూబ‌ర్ షణ్ముఖ్ తో ప్రేమలో ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను వీరిద్దరూ ఎప్పుడూ ఖండించలేదు. అలా అని ప్రేమలో ఉన్నట్లు కూడా ఎప్పుడూ బ‌హిర్గ‌తం చేయ‌లేదు.

కానీ వీరిద్దరి పోస్ట్ లు, సన్నిహితంగా మెలిగే తీరు చూస్తుంటే ప్రేమలో ఉన్నారనే సందేహాలు కలగక మానవు. అయితే ఇప్పుడు దీప్తి సునైనా చేసిన ఓ పోస్ట్ మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మామూలుగానే దీప్తి సునైనా ఫుడ్ లవర్. ఆమెకి తినడమంటే చాలా ఇష్టం. ఎక్కువగా వర్కవుట్లు చేసేది కూడా తినడానికే అని చెబుతుంటుంది.

తాజాగా ఈమె ఓ మీమ్ షేర్ చేస్తూ కామెంట్ పెట్టింది. అందరూ ప్రేమలో పడుతున్నారు కానీ తను మాత్రం ఈ తినడం గోలలోనే ఉండిపోయాననే అర్థం వచ్చేలా ఓ మీమ్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ ద్వారా తను ప్రేమలో లేననే విషయాన్ని చెప్పకనే చెబుతోంది దీప్తి సునైనా. దీంతో దీప్తికి షణ్ముఖ్‌తో బ్రేకప్ జరిగిందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. రీసెంట్‌గా అభిమానులతో ముచ్చటించిన దీప్తి.. ఐదేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.