English | Telugu

ప‌ద్దెనిమిదేళ్ల‌ తర్వాత టీవీ షో కోసం ఇంద్రజ ఏం చేశారంటే?

'యమలీల' సినిమాలో 'నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో...' పాటలో ఇంద్రజ మాస్ డాన్స్ చేస్తే, టాలీవుడ్ ఆడియన్స్ కూడా స్టెప్పులు వేశారు. 'అమ్మ దొంగా'లో ఆమె వేసిన స్టెప్పులు కూడా హిట్టే. అప్పట్లో డాన్స్ బాగా చేసే హీరోయిన్లలో ఇంద్రజ పేరు వినిపించేది. పెళ్లి, పిల్లలు తర్వాత ఇంద్రజ సినిమాలకు దూరం అయ్యారు. రీఎంట్రీలో తల్లి పాత్రలు, పెద్దమనిషి తర్వాత పాత్రల్లో నటించే అవకాశాలు వస్తుండటంతో పాటల్లో డాన్స్ చేసే అవకాశం ఇంద్రజకు దక్కలేదు. కానీ, ఓ టీవీ షోలో డాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది.

'ఈటీవీ'లో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే కామెడీ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. కామెడీ మాత్రమే కాదు... అందులో డాన్స్ పెర్ఫార్మన్స్ లు కూడా వుంటాయి. నెక్స్ట్ సండే, జూలై 18న టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్‌లో ఇంద్రజ డాన్స్ పెర్ఫార్మన్స్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. 'గురు' సినిమాలో 'మెరిసింది మేఘం మేఘం' పాటకు ఇంద్రజ డాన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... పద్దినిమిదేళ్ళ తర్వాత ఓ పాటకు ఆమె డాన్స్ చేయడం. సుధీర్ ఈ విషయం చెప్పాడు.

'మేడమ్ సాంగ్ పెర్ఫార్మ్ చేసి పద్దెనిమిదేళ్ళు అయ్యిందట. కాని ఇక్కడ పద్దెనిమిదేళ్ళ పిల్లలా చేశారు' అని ఇంద్రజకు సుధీర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఈ ఎపిసోడ్‌లో మరో అట్రాక్షన్... మరో సీనియర్ హీరోయిన్ లైలా. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' 25వ ఎపిసోడ్‌ సందర్భంగా ఆమెను గెస్ట్ గా తీసుకొచ్చారు. ఆమె కూడా ఇంద్రజతో కలిసి చిన్నగా కాలు కదపడం విశేషం.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.