English | Telugu

ప‌వన్ కళ్యాణ్‌తో సినిమా మిస్స‌యిన‌ 'కార్తీకదీపం' డైరెక్టర్!

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని దర్శకులందరూ కోరుకుంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అయితే అలాంటి క్రేజీ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని చెబుతున్నారు 'కార్తీకదీపం' దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. బుల్లితెరపై తన సీరియల్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ దర్శకుడు గతంలో 'అందం', 'బంగారు బొమ్మ' అనే సీరియల్స్ ను తెరకెక్కించారు.

అలానే ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నాళ్లు పని చేశారు. అనంతరం మెగాఫోన్ పట్టుకొని మోహన్ బాబుతో 'శివ శంకర్', అల్లరి నరేశ్‌తో 'రాంబాబు గాడి పెళ్లాం' అనే సినిమా చేశారు. దర్శకుడిగా అనుభవం సంపాదించిన తరువాత ఈయనకు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాతగా సినిమా ప్లాన్ చేశారు కూడా. కానీ ఆ సినిమా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి రెండుసార్లు ఆగిపోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇక 'కార్తీకదీపం' సీరియ‌ల్‌ విషయంలో తనపై వస్తోన్న కంప్లైంట్స్, ట్రోల్స్ పై స్పందిస్తూ.. ఆ సీరియ‌ల్‌లో ప్ర‌తి పాత్ర‌ను ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం వలనే ఇలాంటి స్పందనలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.