English | Telugu

దేత్త‌డి హారిక గురించి మీకు తెలీని విష‌యాలు.. ఆమె పెళ్లెప్పుడంటే...

'దేత్త‌డి' హారిక ఇప్పుడొక‌ సెల‌బ్రిటీ. యాంక‌ర్‌గా ఉన్న‌ప్పుడు కంటే బిగ్ బాస్ షోకి వెళ్లాకే ఆమెకు ఆ సెల‌బ్రిటీ హోదా వ‌చ్చింది. హారిక ఎలా ఎదుగుతూ వ‌చ్చింద‌నేది ఆస‌క్తిక‌రం. చిన్న‌ప్పుడు మంచిగా పాట‌లు పాడుతోంద‌ని హారిక రెండున్న‌రేళ్ల వ‌య‌సులోనే ఉండ‌గా సంగీతం నేర్పించాల‌ని చూశారు ఇంట్లోవాళ్లు. సెకండ్ క్లాస్‌లోకి వ‌చ్చేదాకా నేర్చుకుంది కానీ హై పిచ్‌లో పాడుతుంటే హారిక‌కు త‌ల‌నొప్పి వ‌చ్చేసేది. దాంతో ఏడ్చేసేది హారిక‌. ఇది చూసి సంగీతం టీచ‌ర్ తిట్టేది. అందువ‌ల్ల‌నేమో ఆమెకు సంగీతం మీద ఆస‌క్తిపోయింది. సంగీతం క్లాసుల‌కు వెళ్తుంటే త‌ల‌నొప్పి రావ‌డం చూసి, త‌ల‌కు ఏమైనా అవుతుందేమోన‌ని భ‌య‌ప‌డి, సంగీతం మాన్పించేశారు వాళ్ల‌మ్మ జ్యోతి. ఆమె భ‌ర్త నుంచి విడిపోయారు. పిల్ల‌లిద్ద‌ర్నీ త‌నే పెంచి పెద్ద‌చేశారు.

హారిక త‌ల్లి క‌రీంన‌గ‌ర్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు.. వంశీ కార్తీక్‌, అలేఖ్య హారిక‌. వంశీ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌. హారిక బిగ్ బాస్ షోలో ఉన్న‌ప్పుడు ఆమె త‌ర‌పున సోష‌ల్ మీడియాలో మంచి ప్రాప‌గాండా చేశాడు. హారిక హైద‌రాబాద్‌లోనే పెరిగింది. డాన్స్‌ మీద అస‌క్తి చిన్న‌ప్ప‌ట్నుంచే ఉంది. త‌ను హిమాయ‌త్‌న‌గ‌ర్‌లోని హార్వ‌ర్డ్ ప‌బ్లిక్ స్కూల్‌లో చ‌దువుకుంది. డాన్స్ కాంపిటిష‌న్స్‌లో పార్టిసిపేట్ చేసేది. డాన్స్ కోసం క్లాసులకు కూడా బంకు కొట్టేసేది. హారిక చ‌దువుకున్న స్కూల్లోనే ఆమె త‌ల్లి టీచ‌ర్‌గా చేయ‌డం గ‌మ‌నార్హం. ఆమె ఎం.ఏ. పొలిటిక‌ల్ సైన్స్ చ‌దువుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగం రావ‌డంతో ఆమె టీచ‌ర్ ప‌ని వ‌దిలేశారు. హారిక సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్‌లో చ‌దువుకున్నాక‌, కొంత కాలం అమెజాన్‌లో ఉద్యోగం చేసింది.

హారిక‌కు ఊరికే ఇంట్లో కూర్చోవాలంటే ఆమె చేత‌కాదు. ఎప్పుడూ ఏదో ఒక ప‌నిచేస్తుండాల‌నే మ‌న‌స్త‌త్వం ఆమెది. ఇప్పుడ‌ప్పుడే పెళ్లి చేసుకొనే ఉద్దేశం ఆమెకు లేదు. ప్ర‌స్తుతం ఆమె దృష్టంతా ప‌నిమీదే. ఇటీవ‌లే ఒక వెబ్ సిరీస్ చేసింది. కెరీర్‌లో సంతృప్తి చెందాక ఆమెకు పెళ్లి చేస్తామ‌ని వాళ్ల‌మ్మ చెప్పారు. ఒకసారి తాను ఒక‌రితో ప్రేమ‌లో ఉన్నాన‌నీ, నాలుగేళ్ల త‌ర్వాత అత‌నితో బ్రేక‌ప్ అయ్యింద‌నీ బిగ్ బాస్ హౌస్‌లో ఉండ‌గా బ‌య‌ట‌పెట్టి సంచ‌ల‌నం సృష్టించింది హారిక‌. ఆ విష‌యం తొలిసారి వాళ్ల‌కు ఆమె చెప్పింది ఆ ప్లాట్‌ఫామ్ నుంచే. ఆమె త‌ల్లి ఒక ఐదేళ్ల పాటు హిమ‌య‌త్ న‌గ‌ర్‌లో ఒక బౌటిక్‌ న‌డిపి, ఫ్యామిలీని మ‌ణికొండ‌కు షిఫ్ట్ చేయ‌డంతో ఇటీవ‌లే దాన్ని తీసేశారు. ఇప్పుడామె హారిక యూట్యూబ్ చాన‌ల్ కోసం వీడియోలు చేసే ప‌నిలో ఉన్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.