English | Telugu

'బిగ్ బాస్ 5'లో సీరియల్ హీరోయిన్!

ఇప్పటివరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి పేరున్న సెలబ్రిటీలను తీసుకొచ్చి హైప్ పెంచాలని చూస్తోంది బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల పేర్లను పరిశీలించారు. కామెడీని పండించడానికి ఒకరు, గ్లామర్ షో చేయడానికి మరొకరు, ఫైర్ బ్రాండ్ లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్లని ఇలా అన్ని ఎమోషన్స్ ను పండించేవారిని ఒక్కొక్కరిగా ఎంపిక చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా బుల్లితెర నటి, యాంకర్ సిరి హన్మంత్ కూడా బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్లో యాంకర్‌గా మెరిసిన సిరి ఆ తరువాత సీరియల్స్ వైపు అడుగులేసింది.

పలు షోలకు హాజరవుతూ ఇప్పుడిప్పుడే పాపులారిటీ పెంచుకుంటున్న ఆమెకి బిగ్ బాస్ షో నుండి కాల్ వచ్చిందట. అయితే ఈ విషయంలో ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరి ఈ ఆఫర్‌ను ఆమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి. మరోపక్క హీరోయిన్ ఇషా చావ్లా, యాంకర్ లోబోను కూడా ఈ షోలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.