English | Telugu

సభాముఖంగా అవినాష్ పంచె ఊడింది!

అవినాష్ పంచె ఊడింది. అదీ సభాముఖంగా! పంచె ఊడిన తర్వాత స్టేజి మీద నుంచి అవినాష్ వెళ్తున్న సమయంలో యాంకర్ శ్రీముఖి వీడియో తీసింది. దానిని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అందులో అవినాష్ వెనుక పంచె తీసుకుని నడుస్తున్న అసిస్టెంట్ మరొకరు కూడా ఉన్నారు. శ్రీముఖిని వీడియో తీయవద్దని అంటున్నట్టు అవినాష్ సైగ చేయడమూ కనిపించింది. 'సభాముఖంగా మా రాయుడు పంచె ఊడింది' అని శ్రీముఖి కాప్షన్ ఇచ్చింది.

'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన అవినాష్, ఇప్పుడు ఆ షో చెయ్యడం లేదు. స్టార్ మా ఛానల్ లో షోస్ చేస్తున్నాడు. 'బిగ్ బాస్' తరవాత నుంచి స్టార్ మాతో కంటిన్యూ అవుతున్నాడు. లేటెస్ట్ గా 'స్టార్ మా పరివార్ చాంపియన్షిప్' అని ఒక షో షూటింగ్ చేశారు. అందులో 'పెదరాయుడు' గెటప్ వేశాడు అవినాష్. స్కిట్ పూర్తయిన తరవాత పంచె ఊడిందా? స్కిట్ లో పంచె ఊడటం భాగమా? అన్నది షో టెలికాస్ట్ అయితే గాని తెలియదు.

ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేసింది. షూటింగ్ మధ్యలో తీసుకున్న కొన్ని వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.