English | Telugu

విష్ణుప్రియకి కాబోయే భర్త ఎలా ఉండాలంటే..?

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ఆ తరువాత బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో కొన్ని షోలు చేసినప్పటికీ ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన 'పోవే పోరా' అనే షో ఆమెకి పాపులారిటీ తీసుకొచ్చింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంటుంది. మరోపక్క యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరికొంతమందికి దగ్గరైంది.

ఈ లాక్ డౌన్ సమయంలో తన స్నేహితురాలు శ్రీముఖితో కలిసి ఆమె చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ మధ్యకాలంలో స్కిన్ షో చేస్తూ రచ్చ చేస్తోంది విష్ణుప్రియ. ప్రస్తుతం డైటింగ్ చేస్తున్న‌ విష్ణుప్రియ తన అందాలు ప్రదర్శిస్తూ పలు వీడియోలు షేర్ చేస్తోంది. వీటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోవర్లతో ముచ్చటించింది. ఈ క్రమంలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ కొన్ని కామెంట్స్ చేసింది. తనకు 'ఆషికి 2' సినిమాలో హీరో ఆదిత్యరాయ్ కపూర్ లాంటి వ్యక్తి భర్తగా కావాలని.. "ఈ జన్మలో కాకపోయినా.. వచ్చే జన్మలో అయినా ఇలాంటి వ్యక్తిని భర్తగా ప్రసాదించు దేవుడా" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం విష్ణుప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.