English | Telugu

ఇదిగో.. హ‌రితేజ చిన్నారి కూతురు భూమి!

ఇటు బుల్లితెర‌, అటు వెండితెర‌.. రెండింటిపైనా రాణిస్తోన్న హ‌రితేజ‌కు ఇటీవ‌ల ఓ పండింటి పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆమెకు భూమి అనే పేరు కూడా పెట్టింది. అయితే ఇంత‌దాకా పాప ముఖాన్ని ప్ర‌పంచానికి చూపించ‌లేదు హ‌రితేజ‌. ఈరోజు శుక్ర‌వారం (జూన్ 9) పాప‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పాప ఫొటోల‌ను కొన్నింటిని ఆమె షేర్ చేసింది. ఆ ఫొటోల‌కు "Meet Ms Bhoomi Deepak Rao" అనే క్యాప్ష‌న్ జోడించింది.

హ‌రితేజ షేర్ చేసిన ఫొటోల‌లో బ్యూటిఫుల్‌ భూమి భిన్న ర‌కాల హావ‌భావాల‌తో ద‌ర్శ‌మివ్వ‌డం విశేషం. ఒక ఫొటోలో ఆశ్చ‌ర్యంగా క‌ళ్లు పెద్ద‌వి చేసుకొని చూస్తూ, ఇంకో ఫొటోలూ న‌వ్వుతూ, మ‌రో ఫొటోలో ఆస‌క్తిగా దేన్నో చూస్తూ.. ఎంత ముచ్చ‌ట‌గా ముద్దొస్తూ ఉందో!

తెర‌మీద హాస్యాన్ని పండిస్తూ వస్తున్న హ‌రితేజ సోష‌ల్ మీడియాలోనూ న‌వ్వులు పూయిస్తుంటుంది. అయితే అందుకు భిన్నంగా డెలివెరీ సమయంలో తాను పడిన కష్టాల గురించి హరితేజ చెప్పిన విషయాలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి. కొద్ది రోజుల క్రితం పాప మొహాన్ని చూపించకుండా హరితేజ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 'భూమి దీపక్ రావ్' అంటూ పెట్టిన పేరుకి వివరణ కూడా ఇచ్చింది. ''భూమి అంటే సహనంతో ఉంటుందని అనుకుంటున్నారు.. కానీ వాళ్లకేం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే'' అని తన బిడ్డ చెబుతున్నట్టుగా హరితేజ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.