చనిపోదామనుకున్నా.. గాయని చిత్ర వల్లే బయటపడ్డాను!
బాల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సింగర్ కల్పన.. బాలకృష్ణ నటించిన 'సీతారామ కళ్యాణం' సినిమాలో ఓ పాటలో కనిపించారు. అలానే విఠాలాచార్య దర్శకత్వంలో 'కామాక్షి కటాక్షం' అనే సినిమాలో నటించారు. అలానే తమిళ, మలయాళ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. అయితే ఎక్కువ లైట్లు, అవుట్ డోర్ షూటింగ్ లంటే ఇష్టం లేకపోవడంతో నటిగా ప్రయాణం సాగించలేకపోయారు.