English | Telugu

చనిపోదామనుకున్నా.. గాయ‌ని చిత్ర వ‌ల్లే బ‌య‌ట‌ప‌డ్డాను!

బాల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సింగ‌ర్‌ కల్పన.. బాలకృష్ణ నటించిన 'సీతారామ కళ్యాణం' సినిమాలో ఓ పాటలో కనిపించారు. అలానే విఠాలాచార్య దర్శకత్వంలో 'కామాక్షి కటాక్షం' అనే సినిమాలో నటించారు. అలానే తమిళ, మలయాళ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. అయితే ఎక్కువ లైట్లు, అవుట్ డోర్ షూటింగ్ లంటే ఇష్టం లేకపోవడంతో నటిగా ప్రయాణం సాగించలేకపోయారు. అయితే ఇప్పటికీ నటనపై ఆసక్తి ఉందని ఆమె చెబుతుంటారు.

త‌ర్వాత కాలంలో ఆమె సంగీత పాఠాలు నేర్చుకొని సింగర్‌గా మారారు. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా ఆమె పాల్గొన్న విష‌యం తెలిసిందే. హౌస్‌లో ఆమె ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఆ సమయంలో కల్పనపై మీమ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. ఎక్కువ రోజులు ఆమె షోలో కంటిన్యూ చేయలేకపోయారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న కల్పన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

2010లో అన్నీ పోగొట్టుకున్నానని.. ఆ సమయంలో చనిపోదామనుకున్నట్లు చెప్పి దిగ్భ్రాంతికి గురిచేశారు. ఆ ఆలోచన నుండి గాయని చిత్ర తనను బయటకి తీసుకొచ్చారని.. చిన్నప్పటి నుండి ఆమెతో పరిచయం ఉందని చెప్పారు. మలయాళంలో ఓ షో జరుగుతోందని.. ఎలిమినేట్ అయినా పర్లేదు.. ప్రశాంతంగా ఉంటుంది వస్తావా అంటూ చిత్ర అడగడంతో.. ఎలాగైనా గెలవాలనే కసితో ఆ షోలో పాల్గొన్నట్లు చెప్పారు. అప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు.. తన వల్ల ఇండస్ట్రీ పరువు పోతోందని చాలా మంది అన్నారని తెలిపారు. ప్రొఫెషనల్ సింగర్ ఇలా కంటెస్టెంట్ గా రావడం ఏంటని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. ఫైనల్‌గా ఆ షోలో తనే విజేతగా నిలిచినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.