English | Telugu

ఇమ్మాన్యుయేల్‌కు నిజంగా వేరేవాళ్ల‌తో పెళ్ల‌యితే వ‌ర్ష ప‌రిస్థితి ఏంటి?

తెలుగు బుల్లితెరపై పాపులర్ టీవీ షోలలో 'జబర్దస్త్' ఒకటి. చాలా ఏళ్లుగా అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతోంది ఈ షో. తాజాగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో రోజా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ వర్ష కన్నీరు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 'జబర్దస్త్' షోలో వర్ష-ఇమ్మానుయేల్ జోడీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ జంట కెమెరా ముందు రొమాన్స్ ను పండిస్తూ బుల్లితెర ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది.

బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినా ఈ జోడీకి మంచి డిమాండ్ పెరిగింది. వీళ్ల మధ్య కెమిస్ట్రీ చూసిన వారికి ప్రేమాయణం నడుస్తుందనే అభిప్రాయం క‌ల‌గ‌కుండా ఉండ‌దు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో వర్ష కనీళ్లు పెట్టుకోవడానికి కారణం కూడా వీరి లవ్ మ్యాటరే అనే సందేహాలు కలుగుతున్నాయి.

స్కిట్ లో భాగంగా ప్రేమించుకున్న వర్ష-ఇమ్మాన్యుయేల్ పెళ్లి చేసుకోలేకపోతారు. వర్షకి బదులు ఇమ్మానుయేల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. దీంతో వర్ష తెగ ఫీలైపోతుంది. ఈ స్కిట్ పూర్తయ్యాక రోజా రియాక్ట్ అవుతూ.. "స్కిట్ లోనే ఇంత బాధపడుతోంది. నిజంగా ఇమ్మాన్యుయేల్‌కు వేరే వాళ్లతో పెళ్లయితే వర్ష పరిస్థితి ఏంటి..?" అని అడగ్గానే ఆమె కన్నీరు పెట్టుకుంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది.

"మ‌నం ఉండాల‌నుకున్న ఆ ప్లేస్‌లో వేరే అమ్మాయి ఉంటే త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం.." అని విప‌రీత‌మైన భావోద్వేగానికి గురైంది. ఇది చూసిన ఇమ్మాన్యుయేల్ షాకవుతూ చూశాడు."ఇమ్ము ఎక్స్‌ప్రెష‌న్‌కి ఏంటి అర్థం అనేది నాకింకా అర్థం కాలా" అని రోజా అన‌డంతో క‌ళ్ల‌ను చేత్తో వ‌త్తుకున్నాడు ఇమ్మానుయేల్‌. అత‌డి వంక ఎమోష‌నల్ ఫీలింగ్‌తో అలాగే చూసింది వ‌ర్ష‌.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.