English | Telugu

"నువ్వు అంత వంగ‌కు ప్లీజ్‌".. అన‌సూయ పొట్టి డ్ర‌స్‌పై సుమ కామెంట్స్‌!

ఈ మధ్యకాలంలో చాలా టీవీ షోలను కామెడీ థీమ్‌తో రూపొందిస్తున్నారు. యాంకర్ సుమ హోస్ట్ చేసే వీడియోల్లో కామెడీ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆమె యాంకరింగ్ చేస్తోన్న 'క్యాష్' షోకి మంచి రేటింగ్స్ వస్తుంటాయి. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. జూలై 3న ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ షోకి యాంకర్ అనసూయ, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, నటులు ప్రియదర్శి, అభినవ్ గోమటం గెస్ట్ లుగా వచ్చారు. వీరంతా తమదైన స్టైల్‌లో పంచ్‌లు విసురుతూ రచ్చ చేశారు. "ఎవరైనా సరే లాక్ డౌన్ లో లావు అవుతారు లేదా సన్నగా అవుతారు.. నువ్వేంటి ఇంకా పొడుగయ్యావ్?" అంటూ అనసూయపై పంచ్ వేసింది సుమ. "నేనింకా పెరుగుతున్నానా!" అని ఆనంద‌ప‌డింది అన‌సూయ‌

ఆ తరువాత మాటల మధ్యలో "ఇంద్ర‌జ‌తో అయ్యో ఎంత మ‌ర్యాదండీ మీకు.. ఇక్కడ ఎవరికీ లేదు." అని సుమ అంటుండగా.. వెంటనే అనసూయ "అక్కా.. ఏం మాట్లాడుతున్నారు.. నాకు రెస్పెక్ట్ లేదా" అంటూ సుమ కాళ్లు పట్టుకోబోయింది... "నువ్వు అంత వంగకు ప్లీజ్‌" అంటూ అనసూయ పొట్టి డ్రెస్‌ను చూస్తూ కామెంట్ చేసింది సుమ. దాంతో అవాక్క‌వుతూనే న‌వ్వేసింది అన‌సూయ‌.

అనంతరం అనసూయ "అక్కా నేను ఫుల్ కొట్టినా" అని త‌న పోడియంను కొట్ట‌గా, "ఫుల్ కొట్టావా.. అయ్యా" అని ఆశ్చ‌ర్యం న‌టిస్తూ నోటి మీద చెయ్యేసుకుంది సుమ‌. ఆ తరువాత రైల్వే స్టేషన్ లో పెళ్లిచూపుల కార్యక్రమం చేపట్టి అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.