English | Telugu

మంగ్లీ మోడ్ర‌న్ లుక్.. దేని కోసం?

ఒకప్పుడు యాంకర్ గా, తెలంగాణ జానపద గీతాలతో ప్రేక్షకులను అలరించేది మంగ్లీ. 'తీన్మార్' అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిచయమైన ఈమె.. ఆపై పలు పాటలతో ఆకట్టుకుంది. పలు టీవీ షోలలో పాల్గొనే అవకాశం తెచ్చుకొని బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాల్లో కూడా సింగర్ గా ఆమెకి ఛాన్స్ లు వస్తున్నాయి. 'లవ్ స్టోరీ' సినిమాలో ఆమె పాడిన 'సారంగ దరియా' పాటకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించిన మంగ్లీ తొలిసారి ట్రెండీ గెటప్ లో కనిపించి షాకిచ్చింది. డార్క్ బ్లూ క‌ల‌ర్ స్క‌ర్ట్ ధ‌రించిన ఆమె, ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసి, వాటికి "మోడ‌ర‌న్ మంగ్లీ" అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. త్వరలోనే మొదలుకానున్న 'బిగ్ బాస్' షోలోకి మంగ్లీ వెళ్తోంద‌నీ.. అందులో భాగంగానే ఆమె ఇలా కొత్త లుక్కులో దర్శనమిస్తున్న‌ట్లుగా ఉంద‌నీ అంటున్నారు ఫ్యాన్స్.

నిజానికి బిగ్ బాస్ సీజన్ 4లో మంగ్లీ కంటెస్టెంట్ గా కనిపిస్తుందని అన్నారు. కానీ అలా జరగలేదు. ఇక సీజన్ 5లో ఆమెని తీసుకురావడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కారణం ఏదైనప్పటికీ మంగ్లీ మాత్రం తన ట్రెండీ లుక్‌తో ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. మంగ్లీని ఇప్పటివరకు ఇలాంటి గెటప్ లో చూడని అభిమానులు ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.