English | Telugu

ఏ మూవీ ఐనా బుల్లితెర మీద ప్రమోట్ చేసుకోవాలి..నాకు స్మాల్ స్క్రీన్ అంటేనే ఇష్టం

శ్రీదేవి డ్రామా కంపెనీలో కొంత మందిని ఈ వారం రష్మీ ఇంటర్వ్యూ చేసింది. ఇక ఎపిసోడ్ ఫైనల్ లో మాత్రం ఇంద్రజ రష్మీని ఎన్కౌంటర్ చేసింది. "రష్మీ మీరు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేకపోయారు...స్మాల్ స్క్రీన్ మీద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఐనా బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేకపోయాను అనే బాధ మీకు ఉందా" అని ఇంద్రజ రష్మీని అడిగింది. ఈ ప్రశ్నకు జెన్యూన్ గా ఆన్సర్ చెప్పాలి అని చెప్పింది ఇంద్రజ. "నేను బిగ్ స్క్రీన్ మీద ఏం ఎక్స్పీరియన్స్ చేసాను అంటే చెప్పేది ప్రతీ సారి జరగదు. ఇందాక మహేష్ గారు చెప్పినట్టు రాత్రికి రాత్రి క్యారెక్టర్స్ మారిపోతాయి. మీరు సెకండ్ హీరోయిన్ అని చెప్తారు. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ రోల్ కాస్త ఫ్రెండ్ రోల్ కి మారిపోతుంది. జనాల ఆలోచన విధానం కూడా మారిపోయింది. ఫ్రెండ్ రోల్ అంటే స్టాంప్, మదర్ రోల్ అంటే స్టాంప్ ఇప్పుడు ప్రతీ ఒక్క రోల్ ని క్యారెక్టర్ కింద చూస్తున్నారు.

 ఫ్రిజ్ లో కూర్చున్న నందిని రెడ్డి...అమ్మా నేను ఎప్పుడూ మాట్లాడుకోము అన్న సంతోష్

మదర్స్ డే స్పెషల్ ఈవెంట్స్ తో ఆదివారాన్ని మరింత స్పెషల్ గా మార్చేసింది బుల్లితెర. స్టార్ మాలో ప్రసారమైన "లవ్ యు అమ్మ" ఎపిసోడ్ మస్త్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో బుల్లితెర సెలబ్రిటీస్ అంతా వాళ్ళ వాళ్ళ అమ్మలతో, పిల్లలతో కలిసి వచ్చారు. అలాగే ఈ షోకి "అన్ని మంచి శకునములే" మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి, హీరో సంతోష్ శోభన్ వచ్చారు. నందిని రెడ్డి వాళ్ళ అమ్మ రూపతో కలిసి వచ్చింది. "హ్యాపీ మదర్స్ ముందుగా మీకు..చిన్నప్పుడు మీరు నందిని గారిని ఏమని పిలిచేవారు" అని అడిగింది శ్రీముఖి. "పాపా..బేబీ" అంటూ పిలిచేదాన్ని అన్నారు. "అందుకే ఓ బేబీ అని పేరు పెట్టారా మీ మూవీకి" అంది శ్రీముఖి. నందిని అవును అన్నట్టుగా తల ఊపింది. "చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారా" అని శ్రీముఖి అడిగేసరికి " చాలా అల్లరి చేసేది. తనకు మూడేళ్లున్నప్పుడు..మంచి ఎండాకాలం వచ్చింది. ఒక రోజు మేమంతా నందిని కోసం వెతుకుతూ ఉన్నాం.

అవకాశాల కోసం మహేష్ భజన చేస్తాడా ? ఆదర్శ్ ని ఇండస్ట్రీలో కొంతమంది తొక్కేశారా ?

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎపిసోడ్ అలరించింది. అందులో రష్మీ కమెడియన్స్ ని తన ప్రశ్నలతో ఎన్కౌంటర్ చేసి వాళ్ళ నుంచి సమాధానాలను రాబట్టింది.  వాళ్ళు కూడా అలాగే ఆన్సర్ చేశారు. ఇక ఇందులో మహానటి, రంగస్థలం మూవీస్ లో నటించిన మహేష్ ని హాట్ సీట్ లోకి రమ్మని పిలిచింది రష్మీ. "మహేష్ గారు మీరు సినిమా అవకాశాల కోసం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దగ్గర భజన చేస్తారట..నిజమేనా ? " భజన అంటే కాదు.  మనకంటే ముందు సక్సెస్ ఐనవాళ్లు ఉంటారు కదా. వాళ్ళ టాలెంట్ కి, సక్సెస్ కి రెస్పెక్ట్ ఇవ్వడాన్ని ప్రజలు భజన అనుకుంటున్నారేమో.. అంత భజన చేసేవాడిని ఐతే అన్ని మూవీస్ లోనూ నేనే ఉండాలి కదా .. భగవంతుడు ఏది రాస్తాడో అదే మనకు వస్తుంది. రైటర్ రాసేది కూడా నాకు  వస్తుంది అని నేను నమ్మను ఎందుకంటే నైట్ కి నైట్ మారిపోయే క్యారెక్టర్స్ ఎన్నో ఉంటాయి.