Read more!

English | Telugu

జెస్సి లేడీస్ తో చాట్ అలా మొదలుపెడతాడట..

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఎపిసోడ్ మంచి జోష్ గా జరిగింది. "ఓపెన్ హార్ట్ విత్ రష్మీ" సెగ్మెంట్ మాత్రం మంచి హాట్ గా సాగింది. ఇందులో మోడల్ జెస్సిని ఇంటర్వ్యూ చేసింది రష్మీ. "మీకు బాగా పిచ్చి అని అందరూ అనుకుంటారు..అలాగే మీరు ఉమనైజర్ అని...ఫ్లర్ట్ చేస్తారంటూ బయట టాక్" దీని మీద మీ అభిప్రాయం "నేను అందరితో ఓపెన్ గానే ఉంటాను ఎందుకంటే నా వాయిస్ చిన్నపిల్లాడిలా ఉంటుంది. కాంటాక్ట్ తీసుకున్న ప్రతీ ఒక్క అమ్మాయితో  నేనేమీ అతుక్కుపోను..నేను ఎవరితో మాట్లాడినా అది నచ్చని వాళ్ళు బయట నెగటివ్ గా నా మీద ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తున్నారు.

నాకు నైట్ టైం ఫోన్ చేసి డబ్బులు వేయమని జిపే నంబర్లు ఇస్తారు. డబ్బు పంపిస్తేనే  మాట్లాడతాం అంటారు. లేదంటే మాట్లాడ్డం ఆపేస్తున్నారు. మళ్ళీ సెట్ లోకి వచ్చి ఏమీ తెలియనట్టు నటిస్తూ అలా ఉండకు, ఇలా చేయకు నాకు చెప్పడానికి వీళ్ళెవరూ. ఇంత డబుల్ యాక్షన్ ఎందుకు అవసరమా అనుకుంటూ ఉంటాను. అందుకే నేను గత ఆరు నెలల నుంచి  ఎవరితోనూ మాట్లాడ్డం లేదు, ఏవీ పోస్ట్ చేయడం లేదు. నాకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి అన్న విషయం తెలీదు. కొంచెం ఎక్కువ రేపో వచ్చాక బయటికి వెల్దామా అని అడుగుతాను. వాళ్ళు ప్రాజెక్ట్స్ గురించి అడిగితే ఆఫీస్ కి రమ్మని చెప్తాను." అన్నాడు.

"జెస్సి మేము విన్నది ఏమిటి అంటే మీరు ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని అందులో అమ్మాయికి క్యారెక్టర్ ఉంటదని చెప్పి అలా మీరు లేడీస్ తో చాట్ మొదలుపెడతారట" అని ఇంద్రజ అడిగేసరికి సెట్ లో ఉన్న అంకిత, దివ్య, స్రవంతి, శ్వేతా  వంటి వాళ్ళను అడిగాడు జెస్సి తానూ ఎలాంటి వాడినో చెప్పాలని..అప్పుడు  వాళ్లంతా కూడా గుడ్ పర్సన్ అని కితాబిచ్చారు. ఫైనల్ గా "జెస్సి నేను మిమ్మల్ని అప్పుడప్పుడు లస్సి అని పిలుస్తాను కదా మీరెప్పుడైనా హర్ట్ అయ్యారా" అని రష్మీ అడిగేసరికి "లేదు" అని చెప్పాడు జెస్సి. ఇలా అతన్ని రకరకాల ప్రశ్నలు వేసి నిజం బయటపెట్టించింది.