Read more!

English | Telugu

బ్రహ్మముడి సీరియల్ కి బ్రహ్మరథం పడుతున్న ఫ్యాన్స్!

స్టార్ మా సీరియల్స్ లలో ఈ వారం అత్యధిక టీఆర్పీతో 'బ్రహ్మముడి' సీరియల్ మొదటి ర్యాంక్ లో ఉంది. ప్రతీవారం లాగే ఈ వారం కూడా బార్క్ ఇండియా నిర్దేశించిన టీర్పీలో  బ్రహ్మముడి సీరియలే మొదటి స్థానంలో ఉంది‌. ఆ తర్వాత స్థానాలలో నాగపంచమి రెండవ స్థానం, కృష్ణ ముకుంద మురారి మూడవ స్థానం, గుప్పెడంత మనసు నాల్గవ స్థానాలలో కొనసాగుతున్నాయి.

మానస్, దీపిక రంగరాజు, హమీద, నీప, శ్రీప్రియ, షర్మిత గౌడల నటనతో బ్రహ్మముడి సీరియల్ కి ప్రేక్షకులు‌ బ్రహ్మరథం పడుతున్నారు. కార్తీకదీపం సీరియల్ తర్వాత మళ్ళీ అంతటి బజ్ వచ్చింది బ్రహ్మముడి సీరియల్ కే అనడంలో ఆశ్చర్యం లేదు. బ్రహ్మముడి సీరియల్  డబ్బు, ఆత్మాభిమానంకి మధ్యన సాగే కథగా మొదటి రెండు వారాలు సాగింది. ఆ తర్వాత కావ్యని రాజ్ పెళ్ళిచేసుకున్నాక.. రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ్ మోసం చేశారంటూ కావ్యని ద్వేషించడం స్టార్ట్ చేయగా.. రాజ్ నానమ్మ-తాతయ్యలు కావ్యకి మద్దతు ఇవ్వడంతో ఈ కథ మరింత ఇంట్రెస్ట్ గా సాగుతుంది. పెళ్ళిపీటల మీద నుండి స్వప్న లేచిపోవడంతో ఆ వారం మొత్తం అత్యధిక వీక్షకాదరణ పొందిన ఈ సీరియల్.. ఇప్పుడు స్వప్నని లేపుకెళ్ళింది రాహుల్ అనే నిజం రాజ్ కి తెలిసిపోయింది. దీంతో ఈ సీరియల్ సరికొత్త ట్విస్ట్ తో ముందుకు సాగుతుంది.

బ్రహ్మముడి సీరియల్ ప్రోమో‌ రిలీజ్ అయిన గంటకే వేలల్లో వ్యూస్ రావడంతో పాటు అత్యధిక కామెంట్లు వస్తున్నాయి. కావ్యని రాజ్ అర్థం చేసుకోవాలని ఎక్కువ మంది ప్రేక్షకులు తమ కామెంట్లతో వ్యక్తం చేస్తున్నారు. అప్పు-కళ్యాణ్ ల జోడి బాగుందని ఈ సీరియల్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కనకం-కృష్ణమూర్తిల కుటుంబం మీద ఉన్న సానుభూతి.. దుగ్గిరాల కుటుంబంలో సాగే ఫంక్షన్స్, వారు పాటించే ఆచార వ్యవహారాలు.. రుద్రాణి కన్నింగ్ మైండ్ సెట్ తో రాజ్ వల్ల అమ్మ అపర్ణని పదే పదే విమర్శిస్తూ సాధిస్తుంటుండటంతో ఈ సీరియల్ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే ఈ సీరియల్ ఈ వారం కూడా టాప్ లో నిలిచింది. మొదటి ర్యాంక్ తో బ్రహ్మముడి దూసుకెళ్తుంది.