Read more!

English | Telugu

ఎవరికి తెలియకుండా మురారికి రింగ్ తొడిగిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -156 లో... మురారితో ప్రేమలో ఉన్నప్పటి మెమోరీస్ అన్నింటిని ముకుంద గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన ప్రేమ ఒక గ్రంథాలయం లాంటిది. అందులో నిశ్శబ్దం మాత్రమే ఉంది. తెరిచే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు గుడికి వెళ్తాం కదా.. అక్కడ నీ వేలుకి రింగ్ తొడిగి మన ప్రేమని బ్రతికించుకుంటానని ముకుంద నవ్వుతూ తనలో తానే అనుకుంటుంది.

మరొకవైపు మురారిని భవాని పిలిచి.. వర్క్ మీద కొన్ని రోజులు బయటకు వెళతానని చెప్తుంది. దానికి మురారి సరేనని అంటాడు. ఇక అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. గుడి లోపలికి వెళ్తుంటే.. ఇద్దరు ముసలివాళ్ళు ఆకలి ఆకలి అంటూ బాధపడుతుంటే.. ఏసీపీ సర్ మీరు వాళ్ళకి ఈ రోజు ఏమైనా సాయం చెయ్యండని కృష్ణ అంటుంది. ముందు లోపలికి వెళ్లి అభిషేకం చేసి వచ్చాక చేద్దాం.. ఇప్పటికే లేట్ అయింది.. ఆ తర్వాత వాళ్ళకి సాయం చేద్దువు అని భవాని అంటుంది. నువ్వు వాళ్ళకి సాయం చేసి రా కృష్ణ.. ఆ లోపు మురారి పూజ చేస్తాడని ముకుంద అనగానే.. కృష్ణ వాళ్ళకి సాయం చేయడానికి వెళ్తుంది. రేవతి భవానిలు ప్రదక్షిణలు చెయ్యడానికి వెళ్తారు. అభిషేకం చేస్తున్న మురారి దగ్గర ముకుంద ఉంటుంది. ఇదే మంచి ఛాన్స్ రింగ్ ఎలాగైనా మురారి వేలికి తొడగాలని ముకుంద చూస్తుంది. మరొకవైపు కృష్ణ ముసలి వాళ్ళకి పులిహోర పాకెట్స్.. కొంత డబ్బు ఇచ్చి ఆ తర్వాత  ప్రదక్షిణలు చేస్తుంది. అలా ప్రదక్షిణలు చేస్తున్న కృష్ణని చూసిన రేవతి.. "ఏ ఎడ్డీ మొహం.. ఏం చేస్తున్నావ్.. అక్కడ నీ భర్త ఒక్కడే అభిషేకం చేస్తున్నాడు.. నువ్వు వెళ్ళు.. అది ఇద్దరు కలిసి చెయ్యాలి లేదా నువ్వు తనకి సాయం చెయ్యాలి.. ఇది కూడా తెలియదా" అని కృష్ణపై కోప్పడుతుంది. మరొకవైపు రింగ్ పెట్టాలని టెన్షన్ గా ముకుంద టైం కోసం చూస్తుంది. ముకుంద కాపురం బాగుండాలి.. అప్పుడే నా కొడుకు కోడలు జోలికి రాదని దేవునికి మొక్కుకుంటుంది రేవతి. ఎవరు లేరు.. ఇదే సరైన సమయమని మురారి వేలుకి రింగ్ పెడుతుంది ముకుంద. ఏయ్ ముకుంద ఏం చేస్తున్నావని మురారి అంటూ.. రింగ్ ని తీసే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ రింగ్ రాదు.. అప్పుడే కృష్ణ వస్తుంది. ఆ తర్వాత రేవతి, భవానీలు వస్తారు.

ఆ తర్వాత ఏసీపీ సర్ మీ పర్స్ తీసుకోండని మురారితో కృష్ణ అంటుంది. రింగ్ ని కృష్ణ చూస్తే ప్రాబ్లెమ్ అవుతుందని మురారి లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకుంటుండగా.. ఆ రైట్ హ్యాండ్ తో తీసుకోండని కృష్ణ అంటుంది. ఇక మురారి రింగ్ ని కవర్ చేస్తూ పర్సు తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.