Read more!

English | Telugu

బికినీలో బ్రహ్మముడి సీరియల్ రుద్రాణి.. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్!

షర్మిత గౌడ.. ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' చూసేవారికి ఇట్టే తెలిసిపోతుంది. బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తున్న షర్మిత గౌడ మరోసారి వార్తల్లోకెక్కింది. కన్నడలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న షర్మిత గౌడ..  అ తర్వాత కొన్ని తమిళ్ సీరియల్స్ లో కూడా నటించింది. బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. షర్మిత గౌడకి బ్రహ్మముడి సీరియలే తెలుగులో తొలి సీరియల్ కావడం విశేషం.

వియత్నాంలో సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న షర్మిత గౌడ(రుద్రాణి) హాట్ ఫోటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ కి మేనత్తగా ముందు బాగున్నట్టు నటిస్తూ వెనుకాల గోతులు తీసే నెగెటివ్ పాత్రలో రుద్రాణి నటిస్తూ అందరిని మెప్పిస్తుంది. ఈ సీరియల్ లో పద్దతిగా చీరకట్టులో ఉంటుంది. సీరియల్ లో నెగెటివ్ రోల్ లో ఎక్కువ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది రుద్రాణి. అయితే రుద్రాణి అలియాజ్ షర్మిత గౌడ బయట మాత్రం ఈ సీరియల్ కి భిన్నంగా ఉంటుంది. బికినీతో పాటు ట్రెండింగ్ లుక్ లో కనిపిస్తుంది ఈ భామ. షర్మిత గౌడ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ లు చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తోంది.

తాజాగా షర్మిత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ బికినీ ఫోటోలని తన అభిమానులతో పాటుగా చాలా మంది షేర్ చేయగా షర్మిత గౌడ వాటన్నింటిని స్క్రీన్ షాట్స్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది. ఇదేకాక చాలామంది హాట్ లుక్, ట్రెండీ గర్ల్, మరికొందరైతే మేడమ్ మీరు హీరోయిన్ గా చేయాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. అయితే వీటన్నిటింటిని ఆమె పాజిటివ్ గా తీసుకుంది. నన్ను సపోర్ట్ చేస్తున్న మీకు చాలా థాంక్స్.. నేను ఇంకా ఇలానే మీ ముందుకు వస్తానని షర్మిత గౌడ తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. మొత్తానికి ఇప్పుడు రుద్రాణి(షర్మిత గౌడ) ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఈ హాట్ ఫోటోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి.