Read more!

English | Telugu

 ఫ్రిజ్ లో కూర్చున్న నందిని రెడ్డి...అమ్మా నేను ఎప్పుడూ మాట్లాడుకోము అన్న సంతోష్

మదర్స్ డే స్పెషల్ ఈవెంట్స్ తో ఆదివారాన్ని మరింత స్పెషల్ గా మార్చేసింది బుల్లితెర. స్టార్ మాలో ప్రసారమైన "లవ్ యు అమ్మ" ఎపిసోడ్ మస్త్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో బుల్లితెర సెలబ్రిటీస్ అంతా వాళ్ళ వాళ్ళ అమ్మలతో, పిల్లలతో కలిసి వచ్చారు. అలాగే ఈ షోకి "అన్ని మంచి శకునములే" మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి, హీరో సంతోష్ శోభన్ వచ్చారు. నందిని రెడ్డి వాళ్ళ అమ్మ రూపతో కలిసి వచ్చింది. "హ్యాపీ మదర్స్ ముందుగా మీకు..చిన్నప్పుడు మీరు నందిని గారిని ఏమని పిలిచేవారు" అని అడిగింది శ్రీముఖి. "పాపా..బేబీ" అంటూ పిలిచేదాన్ని అన్నారు. "అందుకే ఓ బేబీ అని పేరు పెట్టారా మీ మూవీకి" అంది శ్రీముఖి. నందిని అవును అన్నట్టుగా తల ఊపింది. "చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారా" అని శ్రీముఖి అడిగేసరికి " చాలా అల్లరి చేసేది. తనకు మూడేళ్లున్నప్పుడు..మంచి ఎండాకాలం వచ్చింది. ఒక రోజు మేమంతా నందిని కోసం వెతుకుతూ ఉన్నాం.

కానీ నందిని బయట వేడిని భరించలేక వెళ్లి ఫ్రిజ్ లో కూర్చుంది" అని చెప్పేసరికి " అవును బయట చాలా హాట్ గా ఉంది..సొల్యూషన్ వెతుక్కోవాలి కదా..అందుకే..నాకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మా అనే పిలుస్తాను" అని చెప్పింది నందిని. సంతోష్ వాళ్ళ అమ్మా ఆ ఈవెంట్ కి రాలేక ఒక వీడియోని పంపించడంతో శ్రీముఖి దాన్ని ప్లే చేసి చూపించింది. "నా కొడుకుగా నువ్వు సక్సెస్ ఐనందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను కానీ, సంగీత్ కానీ ఇంత సెక్యూర్డ్ గా ఉన్నామంటే అది కేవలం నీ వల్లనే..నేను నా కొడుకు అని చెప్పుకునేదాని కన్నా నా నాన్న అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను.. అంత కేరింగ్ గా చూసుకుంటున్నావ్ నువ్వు...ఈ పొజిషన్ కి రావడానికి నువ్వు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసావో నాకు తెలుసు..నువ్వు ఇంకా ఇలాంటి సక్సెస్ లు ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నా..లవ్ యు సో మచ్" అని మెసేజ్ పంపారు.

అది చూసేసరికి సంతోష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి నందిని కూడా ఏడ్చేసింది. తనకు శోభన్ గారు గుర్తొచ్చారని చెప్పింది. "ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా వేలు పట్టుకుని నడిపించారు. రెండు మూడు అడుగులు వేసాక ఆయన్ని అడిగా అసలు ఏమిటి ఈ ఇండస్ట్రీ అని... చాలా ఏడ్చాను. అప్పుడాయన నాతో ఉంటూ నాన్న లెక్క చూసుకున్నారు. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. సంతోష్ ని అందరూ చాలా ఈజీగా జడ్జ్ చేస్తారు... కానీ ఎన్ని కష్టాలు పడ్డాడో నాకే తెలుసు" అంది నందిని. "నేను అమ్మ అసలు అలా మాట్లాడుకోము ఎప్పుడూ..అందుకే ఈ మెసేజ్ చూసేసరికి నాకు చాలా కొత్తగా ఉంది..లవ్ యు మా" అని చెప్పాడు సంతోష్.