Read more!

English | Telugu

పేద కుటుంబానికి అండగా నిలిచిన గుప్పెడంత మనసు సీరియల్ రిషి, వసుధారలు..!

గుప్పెడంత మనసు.. ఈ సీరియల్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. రిషి, వసుధారల లవ్ స్టోరీని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరనే చెప్పాలి. మొదట్లో కాలేజ్ లోకి ఒక స్టూడెంట్ లాగా అడుగుపెట్టిన వసుధార అలియాస్ రక్ష గౌడ.. తన తెలివితేటలతో ఉత్తమ విద్యార్థిగా ఎన్నికైంది. దాంతో రిషి అలియాస్ ముఖేష్ గౌడ మనసులో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు ఏకంగా రిషి ఇంట్లోకి వచ్చేసింది. 

గుప్పెడంత మనసు ఇంత పాపులారిటి రావడానికి రిషి, వసుధారల ఫ్యాన్ బేసే ఒక కారణం.. మరొకటి ఈ సీరియల్ కథ. రిషీధారల ఆన్ స్క్రీన్ ప్రెజెన్సే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్ళిద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. బుల్లితెర టాప్ సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ఒక ఎమోషన్ అనే చెప్పాలి.. నిన్న మొన్నటి దాకా గుప్పెడంత మనసు సీరియల్ స్లాట్ టైమింగ్ చేంజ్ పై ఛానల్ యాజమాన్యానికి ఈ సీరియల్ రెగ్యులర్ గా చూసే ఫాన్స్ విరుచుకుపడడం అందరికి తెలిసిందే..  సోషల్ మీడియాలో స్లాట్ టైం చేంజ్ చెయ్యొద్దంటూ ట్రెండ్ కూడా సెట్ చేసారు.  సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ లతో పాటు యాజమాన్యానికి డైరెక్ట్ కాల్ చేసి రిక్వెస్ట్ చెయ్యడం తెలిసిందే. ఈ సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు. ముఖేష్ గౌడ, రక్ష  గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  వాళ్ళిద్దరు తమ‌ ఇన్ స్టాగ్రామ్ లో చేసే ప్రతీ పోస్ట్ కి విపరీతమైన లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి.

అయితే రిషి, వసుధారలు ఆఫ్ స్క్రీన్ సోషల్ సర్వీస్ చేసి మరింత మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు.. ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా రియల్ హీరో హీరోయిన్ అనిపించుకున్నారు వీరిద్దరు. ఒక ఫ్యామిలీలో ముగ్గురు బ్లైండ్ పీపుల్ ఉండగా.. ఆ తల్లి ఆర్థిక ఇబ్బందులతో భాదపడుతుందని చెప్పింది. వాళ్ళతో ఒక బిసినెస్ స్టార్ట్ చేపించడానికి తమ వంతుగా కొంత డబ్బును రిషి, వసుధారలు అందచేశారు. వారితో కొన్ని పాటలు పాడించారు. కళ్ళులేని  అ ముగ్గరిని ఆదుకోవడానికి దాతలకోసం ఎదురుచూస్తున్నట్లు వాళ్ళ తల్లి చెప్పింది. కళ్ళు లేని ఆ ముగ్గరిని ఆదుకున్నందుకు ఈ గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి, వసుధారలని ఫ్యాన్సే కాకుండా పలువురు పొగిడేస్తున్నారు. యూట్యూబ్ లో అప్లోడ్ అయిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.