Read more!

English | Telugu

సుమ తీసుకున్న మదర్స్ డే స్పెషల్ గిఫ్ట్ అదేనా!

యాంకర్ సుమ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకవైపు షోస్,  సినిమా ఆడియో ఫంక్షన్స్, ప్రైవేట్ ప్రమోషన్స్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉంటూ వస్తుంది. సుమ తనకి సంబంధించిన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. ఎప్పుడు ఏదో కొత్తదనంతో తనదైన మార్క్ పంచ్ లతో వ్లాగ్ లు, వీడీయోలు చేస్తూ ప్రేక్షకులతో వహ్వా అనిపించుకుంటుంది.

సుమ ఏం చేసినా అది పాపులరే అవుతుంది. పెద్ద పెద్ద నటీనటులతో సైతం  సుమ అవలీలగా అనర్గళంగా మాట్లాడేయగలదు అందుకనే ఎక్కువగా ‌సుమని ఆడియో ఫంక్షన్స్ కి ఇంటర్వ్యూలకి ఆహ్వామిస్తుంటారు దర్శక నిర్మాతలు. అలాంటి క్రేజ్ సంపాదించుకున్న సుమ ఇప్పుడు ఒక జ్యువలరీ షోరూంకి వెళ్ళింది. అయితే తనొక ప్రమోషన్ కి వెళ్ళినా .. ఏదో అనుకోకుండా సడన్ గా వచ్చినట్టు చాలా నాచురల్ గా మాట్లాడేసింది సుమ. ఏసురావునగర్ లోని సిఎమ్ఆర్ నగల షోరూం వాళ్ళు.. వాళ్ళ షోరూంలో ఉండే నగల యొక్క ప్రత్యేకతలను జనాలకు తెలియజేయడానికి.. బ్రాండ్ ప్రమోషన్ కోసం సుమని ఆహ్వానించారు. ఈ జ్యువలరీ షోరూంకి తన ఫ్రెండ్ తో కలిసి వెళ్లింది సుమ. అక్కడికి వెళ్ళాక తను తన మార్క్ పంచ్ లతో , చిలిపి కామెడీతో కాసేపు ఫన్ క్రియేట్ చేసింది. వాళ్ళ అమ్మకి ఒక జ్యువలరీ తీసుకుందామని వెళ్ళిన సుమ.. మదర్స్ డే స్పెషల్ గిఫ్ట్  అంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది.

సుమ తన పేరుతో యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రమోషన్ వీడియోని తన ఛానెల్ లో అప్లోడ్ చేసింది సుమ. అయితే ఈ వీడియో మంచి వీక్షకాదరణ పొందుతుంది. "సుమ గారు మీరు ప్రమోషన్ వీడియోని కూడా నార్మల్ గా ఏదో మీరు షాపింగ్ కి వెళ్ళినట్టుగా.. వ్లాగ్ చేసారు కదా అండి సూపర్ మీరు" అంటూ సుమ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.