Read more!

English | Telugu

ఏ మూవీ ఐనా బుల్లితెర మీద ప్రమోట్ చేసుకోవాలి..నాకు స్మాల్ స్క్రీన్ అంటేనే ఇష్టం

శ్రీదేవి డ్రామా కంపెనీలో కొంత మందిని ఈ వారం రష్మీ ఇంటర్వ్యూ చేసింది. ఇక ఎపిసోడ్ ఫైనల్ లో మాత్రం ఇంద్రజ రష్మీని ఎన్కౌంటర్ చేసింది. "రష్మీ మీరు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేకపోయారు...స్మాల్ స్క్రీన్ మీద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఐనా బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేకపోయాను అనే బాధ మీకు ఉందా" అని ఇంద్రజ రష్మీని అడిగింది. ఈ ప్రశ్నకు జెన్యూన్ గా ఆన్సర్ చెప్పాలి అని చెప్పింది ఇంద్రజ. "నేను బిగ్ స్క్రీన్ మీద ఏం ఎక్స్పీరియన్స్ చేసాను అంటే చెప్పేది ప్రతీ సారి జరగదు. ఇందాక మహేష్ గారు చెప్పినట్టు రాత్రికి రాత్రి క్యారెక్టర్స్ మారిపోతాయి. మీరు సెకండ్ హీరోయిన్ అని చెప్తారు.

ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ రోల్ కాస్త ఫ్రెండ్ రోల్ కి మారిపోతుంది. జనాల ఆలోచన విధానం కూడా మారిపోయింది. ఫ్రెండ్ రోల్ అంటే స్టాంప్, మదర్ రోల్ అంటే స్టాంప్ ఇప్పుడు ప్రతీ ఒక్క రోల్ ని క్యారెక్టర్ కింద చూస్తున్నారు. బుల్లితెర మీద ఇప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇప్పుడు వచ్చిన పొజిషన్ వల్ల నేను కొంతమందికి సహాయం చేయగలను. ఇప్పుడు స్మాల్ అండ్ బిగ్ స్క్రీన్ కి అంటూ పెద్ద తేడా లేదు. మీరు ఎంత పెద్ద సినిమా చేసినా బుల్లితెర మీదే మీరు ప్రమోట్ చేసుకోవాలి. బుల్లితెర అంత గొప్పది ఇప్పుడు. 15 ఏళ్ళ క్రితం వేరు...కానీ ఇప్పుడు వేరు. నాకు ప్రతీ రోజూ మూడు, నాలుగు మూవీ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి.

బిగ్ బ్యానర్స్ కాదు కానీ బిగ్ బ్యానర్స్ నుంచి చిన్న చిన్న రోల్స్ వస్తూ ఉంటాయి. సినిమాలో వేరే వేరే పాత్రలు చేస్తాం అది క్రియేటివిటీని బయట పెట్టుకునే అవకాశం కాబట్టి అది వేరు. కానీ బుల్లితెర మీద మనం మన టాలెంట్ ని ఎంతైనా చూపించుకోవచ్చు. నేను ఎప్పటికీ చెప్పేది ఒక్కటే బుల్లితెర మీద చేసేటప్పుడు వచ్చే ఆనందం చాలా గొప్పది..నాకు ఒక వేళ మూవీస్ లో సక్సెస్ వచ్చినా బుల్లితెరను ఎప్పటికీ వదలను " అని చెప్పింది రష్మీ.