Read more!

English | Telugu

పటాస్ ప్రవీణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన ఫైమా!

ఫైమా పటాస్.. ఇప్పుడు అందరికీ సుపరిచితమే.. బాస్ తర్వాత ఎంతో క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఫైమా కూడా ఒకరు. పటాస్ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్ షోలో అవకాశం సంపాదించుకుంది. తన కామెడీ టైమింగ్ తో కామెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో బిగ్ బాస్ సీజన్-6 లో అవకాశం దక్కింది. బిగ్ బాస్ హౌజ్ లో తన కామెడీతో మంచి వినోదాన్ని పంచింది ఫైమా.

బిగ్ బాస్ షో తర్వాత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఫైమా.. బిబి జోడీలో సూర్యతో జతకట్టి డ్యాన్స్ చేసి వహ్వా అనిపించుకుంది ఫైమా. అయితే ఇప్పుడు తాజాగా సొంత ఇల్లు కట్టుకునే పనిలో పడింది. మరోవైపు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. అయితే ఇన్ స్టాగ్రామ్ లో తనకి సంబంధించిన విషయాలని రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది. అయితే తాజాగా 'ఆస్క్ మీ క్రేజీ క్వశ్చన్' అంటూ స్టార్ట్ చేసింది ఫైమా. మీ ఫేవరేట్ సాంగ్ విత్ ఫేవరెట్ పర్సన్ అని ఒకరు అడుగగా.. వాళ్ళ అమ్మతో‌ కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసి దానికి   'ఆరారి రారో' పాటని జతచేసింది. జబర్దస్త్ కి మళ్ళీ వస్తారా అని ఒక అభిమాని అడుగగా.. కమింగ్ సూన్ అని రిప్లై ఇచ్చింది ఫైమా. మీరు పటాస్ షోకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరిని కలిసారని ఒకరు ప్రశ్నించగా.. నేను పటాస్ లోకి వచ్చినప్పుడు విజయ్ పెరుగు అన్న కలసాడు. ఆ అన్ననే నన్ను స్టేజ్ మీదకి ఎక్కించాడు. అప్పుడు ఆ అన్న అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు డైరక్టర్ అయ్యాడని ఫైమా అంది.
 
ఇమాన్యుయల్ టీం లీడర్ అయ్యాడు కదా.. ఫీడ్ బ్యాక్ ఏంటి అని ఒకరు అడుగగా.. తన కష్టానికి ఫలితం దక్కింది. పటాస్ నుండి మేమిద్దరం కలిసి చేసాం.. చాలా అనుభవించాడు. పటాస్ ప్రవీణ్ టీం లీడర్ ఓవర్ నా వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్.. ఓవర్ కాదు.. తనకు వచ్చిన రిజల్ట్ టీం లీడర్.. సైడ్ క్యారెక్టర్స్ చేసే తను ఎన్నో కష్టాలు పడ్డాడు.. టీం లీడర్ అయ్యాడు. ఇప్పుడు మనమందరం అతడిని ఎంకరేజ్ చేయాలని చెప్పింది ఫైమా. జబర్దస్త్ లో మీ ఫేవరెట్ టీమ ఎవరు అక్క అని ఒకరు అడుగగా.‌. బుల్లెట్ భాస్కర్ టీం అని సమాధనమిచ్చింది. ఇలా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది ఫైమా.