Read more!

English | Telugu

స్వప్నకి మళ్ళీ పెళ్ళిచూపులు ఏర్పాటు చేసిన కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -95 లో.. అపర్ణ దగ్గరికి రుద్రాణి వచ్చి.. తనకు కోపం వచ్చేలా మాట్లాడుతుంది. నువ్వు ఇంట్లో అందరికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒంటరిగా మిగిలిపోతావ్.. అసలు రాజ్ కావ్యని గదిలో ప్రేమగా చూసుకుంటున్నాడేమో.. బయటకు అలా కోపంగా ఉంటున్నాడేమో.. అందుకే కావ్యకి సపోర్ట్ చెయ్యడం స్టార్ట్ చేసాడని రుద్రాణి అనగానే.. నా కొడుకు ఎప్పటికి అలా చెయ్యడు.. నటించాల్సిన అవసరం నా కొడుకుకి లేదని అపర్ణ అంటుంది.

మరొక వైపు రాజ్ గదిని నీట్ గా సర్దుతుంటుంది కావ్య.. నీట్ గా సర్దింది పనిమనిషి అనుకొని తనని పొగుడుతాడు. అప్పుడు ఇంత నీట్ గా  చేసింది నేనేనని కావ్య చెప్తుంది.. నువ్వా అసలు బాలేదు.. నా రూమ్ ఎలా ఉండేదో మళ్ళీ అలాగే చేయమని రాజ్ అంటాడు. అది ఎవరైనా రూమ్ అంటారా స్టోర్ రూమ్ అంటారని కావ్య అంటుంది. మరొకవైపు రాహుల్ గురించి స్వప్న ఆలోచిస్తు.. నేను రాహుల్ ని నమ్మి తప్పు చేసానా? అసలు రాజ్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ నుండి భయపడి వచ్చి ఉండకపోయుంటే బాగుండు. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలని రాహుల్ కి ఫోన్ చేస్తుంది. అలా స్వప్న కాల్ చేయడంతో.. ఎప్పటిలాగా రాహుల్ స్వీట్ గా మాట్లాడుతాడు. మళ్ళీ రేపు కలుద్దాం సరిగ్గా మాట్లాడుకోలేదని స్వప్న అనగానే.. సరేనని రాహుల్ అంటాడు. మరొకవైపు రాజ్ నిద్రపోతు గురకపెడతాడు. గురుక పెడుతున్నావంటే నమ్మట్లేదు కదా అని రాజ్ ఫోన్ తీసుకొని.. తన ఫింగర్ తో లాక్ ఓపెన్ చేస్తుంది. రాజ్ గురకని వీడియో తీస్తుంది కావ్య. లేవగానే ఆ వీడియో చూపెట్టాలి.. అప్పుడు గాని నమ్మడని అనుకుంటుంది కావ్య. ఆ తర్వాత స్వప్న దగ్గరికి కనకం చీర తీసుకొని వస్తుంది. అమ్మ ఎన్ని రోజులు అవుతుంది.. నాకు చీర తీసుకొచ్చి నన్ను ప్రేమగా చూసుకున్నావ్‌.. నేను నీ గారాలపట్టిని ఏదో ఒక తప్పు చేసానని నన్ను దూరం పెడుతున్నావని స్వప్న యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఈ చీర నీకు ప్రేమతో తీసుకొచ్చింది కాదు.. రేపు నీకు పెళ్ళిచూపులు‌‌‌‌.. నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. ఇప్పుడైనా లేచిపోవడాలు పారిపోవడాలు చెయ్యకని కనకం అంటుంది.  అమ్మ నాకు ఇప్పుడు వద్దు.. నేను ఈ పెళ్లి చేసుకోనని స్వప్న అంటుంది. నీ కోసం రెక్కలగుర్రం వేసుకొని రాజకుమారుడు ఏం రాడని కనకం అనగానే.. వస్తాడు రెక్కల గుర్రం మీద రాజకుమారుడు వస్తాడని స్వప్న అంటుంది. స్వప్న మాటలు పట్టించుకోకుండా కనకం అక్కడ నుండి వెళ్ళిపోతుంది. 

మరొకవైపు కావ్య తన ఇంటి పనులు చేసుకుంటుండగా కళ్యాణ్ వస్తాడు. మీరెందుకు చేస్తున్నారు వదిన.. పనివాళ్ళు ఉన్నారు కదా అని అంటాడు కళ్యాణ్. ఈ రోజు వాళ్ళు రాలేదు.. మీకు లోపల టీ పెట్టాను.. వెళ్లి తాగండని అనగానే.. సరేనని చెప్పి కళ్యాణ్ వెళ్తుంటాడు. అప్పుడే కావ్యని రాజ్ అదేపనిగా చూడటం గమనిస్తాడు కళ్యాణ్. ఎందుకు అలాగే వదినని చూస్తున్నావని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.