English | Telugu
జయప్రదకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్!
Updated : Oct 17, 2023
జయప్రద.. తెలుగు సినిమా రంగంలో ఆమె ఒక సంచలన కధానాయిక. ఆమె సినిమా ఇండస్ట్రీ లో కి ప్రవేశించినప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్ లు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏలుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో జయప్రద కేవలం తన నటనతో దశాబ్ద కాలం పాటు అగ్ర కధనాయికల్లోఒకరిగా ఉన్నారు. ఆమె నవ్వుకి కొన్నిలక్షల మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఆమె వాయిస్ కి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. హిందీ చిత్ర రంగంలో కూడా ఒక వెలుగు వెలిగిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి రాజకీయ రంగంలో కూడా ఒక వెలుగు వెలిగింది. కాని ఇప్పుడు జయప్రదకు ఉత్తర ప్రదేశ్ లోని కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చెయ్యడం ఆమె అభిమానులని ఆందోళనకి గురిచేస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే... జయప్రద రాజకీయ జీవితం మొత్తం ఉత్తరప్రదేశ్ లోనే జరుగుతుందనే విషయం చాలా మందికి తెలుసు. జయప్రద 2019 లోక్ సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లోక్ సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసింది. ఆ ఎలక్షన్ లో జయప్రద తన సమీప ప్రత్యర్థి అజాం ఖాన్ చేతులో ఓటమి పాలయ్యింది.కాగా ఆ ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల రూల్స్ పాటించలేదని కాబట్టి రూల్స్ ని ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. తదుపరి విచారణ కోర్ట్ అక్టోబర్ 21కి వాయిదా వేసింది. వాస్తవానికి 2019 లోనే జయప్రదపై రామ్ పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యింది. ఆ తర్వాత జయప్రదని వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించినా జయప్రద హాజరు కాలేదు. దీంతో ఇప్పుడు రాంపూర్ కోర్టు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, చిలక కొట్టుడు కొడితే చిన్నదాన, ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లెపూలు ,ఊరేమిటమ్మా పేరేమిటమ్మా నువ్వెవరు, ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం, ఎక్కడో చూసిన జ్ఞాపకం, మౌనమేలనోయి ఈ మరుపురాని రేయి అనే పాటలు మారుమోగిపోతున్నంత కాలం జయప్రద ని ఎవరు మర్చిపోలేరు. ఎన్నో అద్భుతమైన సినిమా ల్లో అత్యద్భుతంగా నటించి అశేష తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో జయప్రద జయప్రదంగా కొలువు తీరి ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ ని తీసుకున్నా తన అందం మొత్తం ముఖం లో ఎక్కడ ఉంది అంటే ఏదో ఒకటి చెబుతారు. కానీ జయప్రద అందం తన ముఖం లో ఎక్కడ ఉంది అంటే మాత్రం ఎవరు చెప్పలేరు. అంతటి సౌందర్య రాసి జయప్రద.