English | Telugu
చరిత్ర సృష్టించిన జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్!
Updated : Oct 17, 2023
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్ 17న ఢల్లీిలో ఘనంగా జరిగింది. ఈసారి టాలీవుడ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు సినిమాలకు అవార్డుల పంట పండిరది. పలు తెలుగు సినిమాలు జాతీయ అవార్డులను గెలుచుకోవడంతో ఈ ఏడాది జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది. అవార్డులు అందుకోయే వారు అక్టోబర్ 16కే ఢల్లీి చేరుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘ఉప్పెన’ దర్శకుడు సానా బుచ్చిబాబు, నిర్మాతలు నిర్మాతలు నవీన యెర్నేని, యలమంచిలి రవిశంకర్, ‘ఆర్‌ఆర్‌ఆర్‘ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, ‘పుష్ప’ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు.
అవార్డుల ప్రదానోత్సవం ముందు జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘తొలిసారి నేషనల్ అవార్డ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ‘పుష్ప’ వంటి కమర్షియల్ చిత్రానికి జాతీయ అవార్డు రావడం డబుల్ అఛీవ్‌మెంట్’’ అన్నారు.
జాతీయ అవార్డుల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అంటే 69 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ఉత్తమనటుడుగా ఎంపికైన నటులు ఎవ్వరూ లేకపోవడం పెద్ద లోటుగా పరిణమించింది. ఇప్పుడు అల్లు అర్జున్ దాన్ని భర్తీ చేస్తూ ఉత్తమ నటుడుగా తొలి జాతీయ అవార్డును అందుకొని చరిత్ర సృష్టించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు, ‘ప్పుష్ప’ చిత్రానికి రెండు అవార్డులు, జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఉప్పెన’, ‘కొండపొలం’ సినిమాలోని ‘ధమ్ ధమ్ ధమ్..’ పాటకు చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయితగా అవార్డు దక్కింది.