English | Telugu
గుంటూరు కారం ఘాటు ఎక్కువేనంట..
Updated : Oct 17, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాబోతున్న అప్ కమింగ్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ కి సంబందించిన ఒక వార్త ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వార్తని విన్న మహేష్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. ఎప్పుడెప్పుడు జనవరి 12 వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అంతలా ఆనందపడటానికి కారణం ఏంటంటే గుంటూరు కారం మూవీ సూపర్ గా ఉండబోతుందనే వార్త బయటకి వచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న తాజా మూవీ గుంటూరు కారం. ఈ సినిమా టైటిల్ తో పాటు మహేష్ బాబు లుక్ బయటకి వచ్చినప్పటి నుంచి సినిమా మీద మహేష్ అభిమానులు అలాగే సినీ అభిమానులు విపరీతమైన అంచనాలని పెట్టుకున్నారు. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు,అలాగే అల వైకుంటపురం మూవీ తో దర్శక మాంత్రికుడుగా కూడా పేరు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఇప్పుడు ఈ మూవీ క్లైమాక్స్ అధిరిపోయిందని అలాగే అతడు మూవీ తర్వాత మళ్ళి ఆ స్థాయిలో త్రివిక్రమ్ గుంటూరు కారం లో కామెడీని పండించాడని అంటున్నారు. సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త తో మహేష్ అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు.
త్రివిక్రమ్ సినిమా లోని మాటలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. గోల గోల గా లేకుండా స్మూత్ గా ఉంటూ సినిమా ఘన విజయంలో తన పాత్రని తాను పోషిస్తాయి. అందుకు ఉదాహరణగా మహేష్,త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన అతడు మూవీనే ఒక ఉదాహరణ. ఏదో సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమేమో అని ప్రేక్షకుడు ఆయా క్యారక్టర్ మాట్లాడుతుంటే జాగ్రతగా వింటూ ఉంటాడు. తీరా క్యారక్టర్ డైలాగ్ చెప్పడం అయిపోయాక అర్ధం అవుతుంది ఆ కారక్టర్ చెప్పింది కామెడీ డైలాగ్ అని. అంతలా త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులని రంజింప చేస్తాయి. ఇక ఆయన సినిమాల క్లైమాక్స్ సీన్స్ కూడా చాలా వెరైటీ గా ఉంటాయి.అందుకు మహేష్,త్రివిక్రమ్ ల కలయిక లో వచ్చిన అతడు,ఖలేజ సినిమాలే ఒక ఉదాహరణ. సో.. గుంటూరు కారం క్లైమాక్స్ అండ్ సినిమా లో ఉన్న కామెడీ సూపర్ గా ఉందనే వార్తలతో గుంటూరు కారం మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.