English | Telugu
స్టార్ స్టార్.. మెగా స్టార్ స్టార్... కొత్త పాట పాడుతున్న పుష్పరాజ్!
Updated : Oct 17, 2023
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను 1990 ప్రాంతంలో జరిగే కథగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో 1998లో రిలీజ్ అయిన చిరంజీవి సూపర్‌హిట్ సినిమా ‘చూడాలని వుంది’ స్రస్తావన కూడా ఉంది. అయితే సినిమా మొత్తం మీద తను చిరంజీవి ఫ్యాన్ అన్నట్టు పుష్ప ఎక్కడా చెప్పలేదు. కానీ, పుష్ప చిరంజీవి వీరాభిమాని అన్నట్టుగా పుష్ప2లో ప్రొజెక్ట్ చెయ్యబోతున్నారు.
నిజజీవితంలో అల్లు అర్జున్‌కి చిరంజీవి అంటే చాలా ఇష్టం. మెగాస్టార్‌కి పెద్ద అభిమాని కూడా, మెగాస్టార్ బర్త్‌డేని అభిమానులతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ‘పుష్ప2’లో అదే క్యారెక్టర్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత హడావిడి ఉంది. ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో అభిమానులు ఎంత పెద్ద ఎత్తున పండగ చేసుకున్నారనే అంశాన్ని ‘పుష్ప2’లో చూపించబోతున్నారు. ఇలాంటి సీన్స్‌ను సుకుమార్ ఎంత బాగా హ్యాండిల్ చేస్తాడో తెలిసిందే. హెవీ క్రౌడ్‌లో ఈ సీన్స్‌ను చాలా గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్‌గా ఉంటుందట. ‘పుష్ప’ ఫస్ట్‌పార్ట్‌కి మామూలు అప్లాజ్ రాలేదు. పైగా నేషనల్ అవార్డులు కూడా గెలుచుకోవడంతో రెండో భాగాన్ని సుకుమార్ మరింత బాధ్యతగా తెరకెక్కిస్తున్నాడు. నిజజీవితంలోనూ హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన అల్లు అర్జున్ సినిమాలో ఆ సీన్స్‌ను ఏ రేంజ్‌లో చేసాడో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.