English | Telugu

వామ్మో 'పుష్ప 2' మీద అంత నమ్మకమా.. రూ.97 కోట్లు ఏంటి సామి!

'పుష్ప' రెండో భాగంగా రూపొందుతోన్న 'పుష్ప: ది రూల్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా రేంజ్ లో సర్ప్రైజ్ హిట్ సాధించింది. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో భాగం అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. 'పుష్ప-2' వరల్డ్ వైడ్ గా కనీసం రూ.1000 కోట్ల గ్రాస్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీగా కోట్ చేస్తున్నారు.

మళ్ళీ రీమేక్ ల రచ్చ.. చిరు 'గాడ్ ఫాదర్ 2' చేస్తున్నారా.? 

మెగాస్టార్ చిరంజీవి రి ఎంట్రీ తర్వాత వరసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఐతే ఎక్కువుగా రీమేక్ సినిమాలే వున్నాయి. కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం కూడా తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. మెగాస్టార్ చేసిన గాడ్ ఫాదర్, భోళాశంకరా మూవీస్ కూడా రీమేక్ సినిమాలే. కానీ ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఫాన్స్ కూడా ఇంకా రీమేక్ సినిమాలు చేయొద్దు అంటూ చిరంజీవి మీద ఒత్తిడి తెచ్చేరని టాక్..ఇప్పుడు చిరు చేస్తున్న సినిమాల లైనప్ లో ఫ్రెష్ కథలే వున్నాయి.