English | Telugu

మళ్ళీ రీమేక్ ల రచ్చ.. చిరు 'గాడ్ ఫాదర్ 2' చేస్తున్నారా.? 

మెగాస్టార్ చిరంజీవి రి ఎంట్రీ తర్వాత వరసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఐతే ఎక్కువుగా రీమేక్ సినిమాలే వున్నాయి. కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం కూడా తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. మెగాస్టార్ చేసిన గాడ్ ఫాదర్, భోళాశంకరా మూవీస్ కూడా రీమేక్ సినిమాలే. కానీ ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఫాన్స్ కూడా ఇంకా రీమేక్ సినిమాలు చేయొద్దు అంటూ చిరంజీవి మీద ఒత్తిడి తెచ్చేరని టాక్..ఇప్పుడు చిరు చేస్తున్న సినిమాల లైనప్ లో ఫ్రెష్ కథలే వున్నాయి.

కానీ కొత్తగా ఇండస్ట్రీ లో చిరంజీవి మళ్ళీ రీమేక్ సినిమా చేస్తారా.? లేదా అని ఓ చర్చ మొదలైంది. దీనికి కారణం లూసిఫర్ దర్శకుడు పృద్విరాజ్ శివకుమారన్ తీసుకున్న నిర్ణయమే. చిరు చేసిన గాడ్ ఫాదర్ లూసిఫర్ కి రీమేక్ నే అనే విష్యం అందరకి తెలిసిందే. లూసిఫర్ కి సీక్వెల్ చేయబోతున్నా అని ఎప్పుడు ఐతే డైరెక్టర్ చెప్పారో అప్పటినుండి చిరు గాడ్ ఫాదర్ 2 చేస్తారా అని చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం చిరంజీవి ద్రుష్టి అంతా కూడా వశిష్ట తో తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా మీదనే ఉంది. ఈ సినిమా అత్యంత భారీ వ్యయం తో నిర్మిస్తున్నారు. లూసిఫర్ 2 కి సంబంధించి జస్ట్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా చిత్రకరణ కి చాలా సమయం పడుతుంది. మోహన్ లాల్ కి కూడా తెలుగు లో మంచి మార్కెట్ నే వుంది. సినిమా రిలీజ్ టైం కి మూవీ టీం తెలుగు లో కూడా సైమల్టేనియస్ గా రిలీజ్ చేస్తారా లేక రీమేక్ రైట్స్ అమ్ముతారా అనేది కూడా క్లారిటీ రావాల్సిందే.

ఇప్పుడు రీమేక్ సినిమాల గురించి ఇంతలా రచ్చ జరుగుతుంది కానీ మెగాస్టార్ కేరియర్ తొలి నాళ్ళల్లో చేసిన సినిమాలలో రీమేక్ సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. చట్టానికి కళ్ళు లేవు , ఖైదీ , విజేత , పసివాడి ప్రాణం , స్నేహం కోసం , ఘరానామొగుడు , హిట్లర్ , ఠాగూర్ మొదలగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.