English | Telugu
డైరెక్టర్‌కి బికినీ ఫోటోలు పంపిన గృహలక్ష్మీ కస్తూరి!
Updated : Nov 13, 2023
హీరోయిన్‌గా ఒక సినిమాలో ఛాన్స్ రావాలంటే అంత ఈజీ కాదు. అందం, అభినయం ఉండాలి.. అంతకుమించి అదృష్టం కూడా కలిసి రావాలి. ఇప్పుడు బుల్లితెరపై సంసారపక్షంగా సీరియల్స్ చేస్తున్న కస్తూరి ఒకప్పుడు స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసింది. ఆమె కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ భారతీయుడు, అన్నమయ్య ఆమెకు బాగా పేరు తెచ్చిన సినిమాలు. ఇప్పుడు బుల్లితెరపై కస్తూరి నటిస్తున్న ‘గృహలక్ష్మీ’ సీరియల్ విజయపథంలో దూసుకెళుతోంది.
బుల్లితెరపై ఎంతో లక్షణంగా చీరకట్టుతో కనిపించే కస్తూరి వయసు 50 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ హాట్ ఫోటోలు, ఇన్‌ఫా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని కొన్ని విశేషాలను గుర్తు చేసుకుంది. కె.రాఘవేంద్రరావు, శంకర్ వంటి దర్శకుల సినిమాలు చెయ్యాలంటే ఎంతటి అదృష్టం ఉండాలో ఆ తర్వాత రోజుల్లో తనకు తెలిసిందట. మొదట ‘భారతీయుడు’ సినిమాలో మొదట తనని హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారట. ఎలాగైనా ఆ సినిమా హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని తను బికినీలో తీయించుకున్న ఫోటోలు పంపిందట. అదే సమయంలో ‘రంగీలా’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుండడంతో అందరూ ఊర్మిళ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. చివరికి ఊర్మిళని హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. చివరికి ఆ సినిమాలో కమల్‌హాసన్ చెల్లెలి పాత్ర దక్కింది.