English | Telugu

వేగంగా ఓటీటీలోకి దూసుకొస్తున్న స్టార్‌ హీరో సినిమా!

ఓటీటీ సంస్థల హవా పెరిగిన తర్వాత థియేటర్లలో సినిమాలు ఎక్కువ కాలం నిలవడం లేదు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు పెట్టిన కొత్త రూల్‌ ప్రకారం రిలీజ్‌ అయిన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అదే కోవలో లేటెస్ట్‌ మూవీ ‘ఘోస్ట్‌’ ఓటీటీకి వచ్చేస్తోంది. నవంబర్‌ 17న జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ హీరోగా యం.జి.శ్రీనివాస్‌ దర్శకత్వంలో శ్రీనీ సినిమాటిక్‌ యూనివర్స్‌లో మొదటి చిత్రంగా ఆక్టోబర్‌ 19 కన్నడ నాట విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తెలుగులో మాత్రం 15 రోజుల తర్వాత నవంబర్‌ 4న విడుదలైంది. అయితే ఇక్కడ ఈ సినిమాకి ఆశించినంత స్పందన లభించలేదు.

‘జైలర్‌’ చిత్రంలో శివన్న పాత్రలో కనిపించి సినిమాకే హైలైట్‌గా నిలిచిన శివరాజ్‌కుమార్‌ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన ‘ఘోష్ట్‌’ చిత్రంతో కర్ణాటకలో భారీ విజయాన్ని అందుకున్నారు. యం.జి.శ్రీనివాస్‌ కన్నడలో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తనే హీరోగా 2019లో అతను రూపొందించిన ‘బీర్బల్‌’ అనూహ్యంగా కర్ణాటకలో పెద్ద విజయాన్ని సాధించింది. బాలీవుడ్‌ నిర్మాతలు ఈ సినిమా రైట్స్‌ను తీసుకున్నారు. ఈ సినిమానే తెలుగులో సత్యదేవ్‌ హీరోగా ‘తిమ్మరుసు’ పేరుతో రూపొందించారు. తెలుగులో కూడా ఈ సినిమా విజయం సాధించింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.