English | Telugu

తెలంగాణలో ఎలక్షన్స్‌.. మాజీ సీఎం భార్య ఫోటోలు వైరల్‌!

తెలంగాణలో నవంబర్‌ 30 ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ పార్టీలు తమ నాయకులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి తన పూర్తి మద్దతును బీఆర్‌ఎస్‌కేనని తెలియజేస్తూ ఓ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే... కర్ణాటకలో సూపర్‌హిట్‌ బేనర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్‌ ‘అజాగ్రత్త’ పేరుతో ఓ పాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తోంది. ‘ది షాడోస్‌ బిహైండ్‌ ది కర్మ’ అనేది ట్యాగ్‌లైన్‌. దేశంలోని ఏడు భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. దర్శకుడు శశిధర్‌ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీ సెట్లను వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. రవిరాజ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ సంచలనం సృష్టిస్తోంది. సోషల్‌ మీడియాలో ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వైరల్‌గా మారింది.
ఇంతకీ విషయం ఏమిటి అనుకుంటున్నారా.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య రాధిక ఈ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది. రాధిక కుమారస్వామి పుట్టినరోజు సందర్భంగా ఏడు భాషల్లో ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య ఈ సినిమాలో నటిస్తోందనగానే సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. 2002లో హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన రాధిక ఇప్పటివరకు ఓ పాతిక సినిమాలు చేసింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. ‘అజాగ్రత్త’తోపాటు ‘భైరదేవి’ అనే సినిమా కూడా నిర్మాణంలో ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.