English | Telugu
బాలయ్య ఉంటే బాగుండేది!
Updated : Nov 13, 2023
'పుష్ప' సినిమాలో ఒక్కటి తక్కువైంది అన్నట్టుగా, ప్రస్తుతం తెలుగు సినీ అభిమానులు ఒక ఫొటో చూసి "ఒక్కరు తక్కువయ్యారు" అంటున్నారు. వెంకటేష్, చిరంజీవి, నాగార్జున కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటో చూసి బాలకృష్ణ కూడా ఉంటే బాగుండేది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
దీపావళి సందర్భంగా చిరంజీవి ఇంట ఘనంగా పార్టీ జరిగింది. రామ్ చరణ్, ఉపాసన నిర్వహించిన ఈ పార్టీలో ఎందరో సినీ స్టార్స్ సందడి చేశారు. సీనియర్ స్టార్స్ వెంకటేష్, నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకీ, నాగ్ తో చిరు ఫొటో దిగగా.. అది సోషల్ మీడియాని ఊపేస్తోంది. ముగ్గురు స్టార్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూసి సినీ అభిమానులు సంబరపడుతున్నారు. అదే సమయంలో బాలయ్య కూడా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. సీనియర్ స్టార్స్ లో చిరు, బాలయ్య, నాగ్, వెంకీ టాలీవుడ్ కి నాలుగు పిల్లర్స్ గా భావిస్తారు. అందుకే బాలయ్య కూడా ఉంటే ఫొటోకి నిండుతనం వచ్చేదని అంటున్నారు.
ఇక చరణ్ ఇచ్చిన పార్టీలో తన తోటి టాప్ స్టార్స్ లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ మిస్ అయ్యారు.