English | Telugu

‘మంగళవారం’ మూవీ రివ్యూ

ఇది 1986లో మొదలైన కథ. శైలజ, రవి అనే ఇద్దరు పిల్లలతో కథ మొదలవుతుంది. ఎంతో ప్రేమగా, అభిమానంగా ఉండే ఇద్దరూ కొన్ని పరిస్థితుల కారణంగా దూరమవుతారు. కట్‌ చేస్తే.. 1996లో ఆ ఊరిలో జంట హత్యలు సంచలనం సృష్టిస్తాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న వారి పేర్లను గోడపై ఎవరో రాస్తారు. అప్పటికే ఆ ఇద్దరు హత్య చేయబడి ఉంటారు. ఇలా రెండు జంట హత్యలు జరుగుతాయి. అసలు గోడలపై ఆ రాతలు ఎవరు రాస్తున్నారు? ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు అనే విషయాలు గ్రామస్తులకు అంతుపట్టదు. ఇక ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్‌.ఐ. మీనా(నందిత శ్వేత) ఆ హత్యల మిస్టరీని ఛేదించాలని ప్రయత్నిస్తుంది. కట్‌ చేస్తే.. ఆమె పేరు శైలజ(పాయల్‌ రాజ్‌పుత్‌). ఆమెకు ఓ విచిత్రమైన వ్యాధి ఉంటుంది....