English | Telugu

ఉగాదికి `#RC 16` ప్ర‌క‌ట‌న‌?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ వేస‌వికి `ఆచార్య‌`తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఇందులో త‌న తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆపై విజ‌య‌ద‌శ‌మికి `ఆర్ ఆర్ ఆర్`తో సంద‌డి చేయ‌నున్నారు. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ తో జ‌ట్టుక‌ట్టిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఆ త‌రువాత సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో పాన్ - ఇండియా మూవీ చేయ‌బోతున్నారు. `#RC15`గా ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

కాగా, `#RC 16`ని `జెర్సీ` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితో చేయ‌బోతున్నారని స‌మాచారం. చాన్నాళ్ళుగా వార్త‌ల్లో ఉన్న ఈ కాంబినేష‌న్ కి సంబంధించి.. అధికారిక ప్ర‌క‌ట‌న ఉగాది ప‌ర్వ‌దినాన రానుంద‌ని బ‌జ్. అంతేకాదు.. పాన్ - ఇండియా మూవీగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని తెలిసింది. అలాగే.. చ‌ర‌ణ్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా మాస్ ఎలిమెంట్స్ తోనే ఈ సినిమా రూపొంద‌నుంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. సో.. మ‌రికొద్దిరోజుల్లో చ‌ర‌ణ్ - గౌత‌మ్ ఫ‌స్ట్ జాయింట్ వెంచ‌ర్ పై క్లారిటీ వ‌స్తుంద‌న్న‌మాట‌.

ఇదిలా ఉంటే.. గౌత‌మ్ తెర‌కెక్కిస్తున్న `జెర్సీ` హిందీ వెర్ష‌న్ దీపావ‌ళి కానుక‌గా థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. ఇందులో షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు.